వైజాగ్ రైల్వే స్టేషన్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈరోజు ఉదయం కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చిన రైలు.. కాసేపట్లో బయలుదేరాల్సి ఉండగా నాలుగో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటల్లో B6, B7, M1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మూడు ఏసీ బోగీలయినప్పటికీ ప్రయాణికులు ఎవరు అందులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పెద్ద ఎత్తున మంటలు చెల్లరేగడంతో ఒక్కసారిగా స్టేషన్ మొత్తం దట్టంగా పొగలు అలుముకున్నాయి. అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపారు. రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలను అర్పుతున్నారు. ఉదయం 6 గంటల సమయంలో బోగిల్లో మంటలు చెల్లరేగాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందని దానిపై విచారణ జరుగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.