యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ హీరో చేసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కోసం ఆరాటపడుతుంటాడు. తాను చేసే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని సందీప్ కిషన్ భావిస్తుంటాడు. అందుకే ఆయన నటించే సినిమాల్లో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తారు. ఇక సందీప్ కిషన్ తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది.
ఈ సినిమాను రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ లుక్ మరోసారి అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉండగా, ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ మైఖేల్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. పాన్ ఇండియా సబ్జెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమా కంటెంట్ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్‌తో పాటు భారీ క్యాస్టింగ్ కూడా ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
కోలీవుడ్‌లో స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి అంచనాలను క్రియేట్ చేయలేదు. కానీ ఆ సినిమా ట్రైలర్ తరువాత ఎలాంటి మేనియా క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇప్పుడు టాలీవుడ్‌లో మైఖేల్ సినిమా కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తోంది. ఈ సినిమాలోనూ పలువురు స్టార్ యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి కల్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తుండటంతో మైఖేల్ వరల్డ్‌వైడ్‌గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళనాట సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రిలీజ్ చేస్తుండటంతో అక్కడ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో నాని గెస్టుగా వస్తుండటంతో ఇప్పుడు టాలీవుడ్‌లో మైఖేల్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.