స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరు సుమారు 40 రోజుల నుంచి ప్రతి రోజూ ట్రెండ్ అవుతూనే ఉంది. దానికి కారణం తన తదుపరి సినిమా ‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబందించిన సాంగ్స్ రిలీజ్ అవ్వడం, అవి రికార్డ్స్ బ్రేక్ చెయ్యడం అలాగే సినిమాకి సంబందించిన చాలా విషయాలు రివీల్ అవుతుండడం. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని 125 ముందు నుంచే మొదలు పెట్టారు.
ఈ సినిమా నుంచి విడుదలైన ‘రాములో రాముల’ అనే పార్టీ టైపు మాస్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే 26 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట గురించి మరో షాకింగ్ విషయం మేము మీకు రివీల్ చేస్తున్నాం. ఈ సాంగ్ పిక్చరైజేషన్ కోసం నిర్మాతలు అక్షరాల 5 కోట్లు ఖర్చు చేశారట. షాక్ అయ్యారా.. నిజమే ఈ సాంగ్ షూట్ కోసం వేసిన పార్టీ సెటప్ సెట్ కే సుమారు 2.5 కోట్లు ఖర్చయ్యిందట.
ఇకపోతే పాట కోసం ముంబై మరియు ఇతర భాషల నుంచి డిఫరెంట్ డాన్సర్స్ ని తెప్పించారు. సినిమాలోని అందరు నటీనటులు ఈ పాటలో పాల్గొన్నారు. అంతే కాకుండా సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరియు అతని ఆర్కెస్ట్రా టీంతో ప్రమోషనల్ సాంగ్ ని కూడా షూట్ చేశారు. అలా ప్రతి విషయంలోనూ లెక్కలు వేయగా ఈ సాంగ్ పిక్చరైజేషన్ పూర్తయ్యే టైంకి ఆ ఒక్క పాట బడ్జెట్ 5 కోట్లుగా తేలిందట.
ప్రస్తుతం ఈ చిత్ర టీం ఓ రొమాంటిక్ డ్యూయెట్ పిక్చరైజేషన్ కోసం యూరప్ వెళ్లారు. డిసెంబర్ మొదటి వారం కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనుంది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న 3వ సినిమా కావడం వలన భారీ అంచనాలు నెలకొన్నాయి.
