మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి మూడవ పాట ‘హుడియో హుడియో’ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’ పాటలు హిట్ కావడంతో, కొత్త గీతంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట మాస్, మెలోడీని అద్భుతంగా కలిపింది. హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ ఇద్దరూ కలిసి ఈ పాటను పాడారు. దేవ్ రాసిన సాహిత్యం సులభంగా అర్థమయ్యేలా, ఉల్లాసంగా ఉండి సంగీతానికి సరైన అందాన్ని తెచ్చింది.
రవితేజ–శ్రీలీల జంట ఈ పాటలో ఆకట్టుకునే కెమిస్ట్రీని చూపించారు. పాత రవితేజ స్టైల్‌ను గుర్తు చేస్తూ ఈ పాట వినేవారిని మంత్రముగ్ధులను చేస్తోంది.
భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ థియేటర్లలో విడుదల కానుంది.


