Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 04 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,113FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 04-04-2025, శుక్రవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల సప్తమి రా 1.49 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం: మృగశిర ఉ 11.15 వరకు, తదుపరి ఆరుద్ర
శుభ సమయం: ఉ 9.15 నుంచి 10.15 వరకు, తిరిగి సా 4.40 నుంచి 6.10 వరకు
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, మ 12.24 నుంచి 1.12 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి: వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటి పెద్దలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

మిథున రాశి: బద్ధకాన్ని దరిచేరినివ్వకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఏ పని కోసం ఇతరులపై ఆధారపడకండి. కొన్ని సమయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. వ్యాపారులకు తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలే మిగులుతాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయండి.

కర్కాటక రాశి: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా నిందలు పడతారు. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అనవసర వాగ్వాదాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల అలసటకు లోనవుతారు.

సింహరాశి: గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న స్థిరాస్తి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. న్యాయ పరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న మనస్పర్ధలు తగ్గుముఖం పడతాయి.

కన్య రాశి: అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేసే పరిస్థితి తలెత్తుతుంది. తోబుట్టువులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. నిర్లక్ష్యం చేయకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోండి.

తులారాశి: ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. అవసరానికి చిన్ననాటి స్నేహితుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుతుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తారు.

వృశ్చిక రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. పని ప్రదేశంలో సమన్వయ లోపం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు. అధికారుల మందలింపు ఉంటుంది. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

ధనస్సు రాశి: వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. అవసరానికి ఆర్థిక సాయం చేసేవారు ఉన్నారు. తోబుట్టువుల మధ్య తలెత్తిన విభేదాలను కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించుకుంటారు. ఇంటి పెద్దలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకర రాశి: నూతన వస్తూ, వాహనాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తారు. కుటుంబ సభ్యులకు విలువైన సమయాన్ని కేటాయిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. మనశ్శాంతిని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

కుంభరాశి: బంధువుల నుంచి అందిన ఒక వార్త ఆందోళనకు గురిచేస్తుంది. తీవ్రంగా శ్రమిస్తే గాని ఆశించిన ఫలితం దక్కదు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

మీన రాశి: ఇంటి పెద్దల అనారోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. నిర్లక్ష్యం చేయకండి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. అవసరానికి మించి ఖర్చులు పెడతారు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కొద్దిపాటి చిక్కుముడులు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మిథునానికి ఉద్యోగంలో శుభవార్తలు, వృశ్చికానికి ఆర్థిక లాభ సూచనలు.

జనవరి 11, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు మేష రాశివారికి పనుల్లో వేగం పెరుగుతుంది. చంద్రబలం వల్ల నిర్ణయాలు సులభంగా తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు రావచ్చు. ఖర్చుల విషయంలో...

Daily Horoscope: ఆర్థిక లాభ సూచనలు మేషం వారికి, ఉద్యోగంలో పురోగతి కన్య వారికి

జనవరి 8, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు చంద్రమాన ప్రభావంతో ఆర్థిక విషయాల్లో సానుకూలత ఉంటుంది. అనుకోని ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

వరద ముంపు కష్టాలకు ముగింపు… గొల్లప్రోలు బ్రిడ్జి పరిశీలనలో పవన్ కళ్యాణ్

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద సుద్దగడ్డ కాలువపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి నిర్మాణ పనుల...

కమిటీల రద్దుతో తెలంగాణ జనసేనలో కొత్త కదలికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పలు విభాగాల కమిటీలను రద్దు చేస్తూ,...