పంచాంగం
తేదీ 23-03-2025, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.
సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:09 గంటలకు.
తిథి: బహుళ నవమి రా. 12.49 వరకు, తదుపరి దశమి
నక్షత్రం: పూర్వాషాడ రా. 12.07 వరకు, తదుపరి ఉత్తరాషాఢ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: సా 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: ప 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: మ. 12.00 నుంచి 1.30 వరకు
రాశి ఫలాలు
మేష రాశి: కష్టకాలం. చేయని తప్పుకు మాట పడాల్సి రావచ్చు. ఆస్తి సంబంధ విషయాల్లో బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆప్తుల నుంచి అందిన వార్త నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ఆలోచనను ప్రస్తుతానికి విరమించడం ఉత్తమం.
వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం.
మిథున రాశి: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. బుద్ధి బలంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
కర్కాటక రాశి: కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం పనికిరాదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
సింహరాశి: ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆహార నియమాలు పాటించాలి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తీవ్రంగా శ్రమిస్తే గాని ఆశించిన ఫలితాలు దక్కవు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.
కన్యారాశి: కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారు ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
తులారాశి: బుద్ధి బలంతో వ్యవహరిస్తారు. సమయస్ఫూర్తితో ఒక సమస్య నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల్లో సఖ్యత ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. పురోగతిలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
వృశ్చిక రాశి: మనోధైర్యం కాపాడుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టిన పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతాన లేమితో బాధపడుతున్న ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి. ఆప్తులతో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.
ధనస్సు రాశి: చేపట్టిన పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే శుభ ఫలితాలను అందుకుంటారు. గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అరువు తీసుకున్న వాహనాల వల్ల ఇబ్బంది పడతారు.
మకర రాశి: ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
కుంభరాశి: మిశ్రమకాలం. ఆత్మవిశ్వాసం దెబ్బతినే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోరాదు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విధుల్లో భాగంగా ఉద్యోగులు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
మీన రాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి ప్రవర్తనతో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.