Switch to English

వియత్నాం.. ఎలా విజయవంతం?

ప్రపంచంలో విలయతాండవం సృష్టిస్తున్న కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక దేశాలన్నీ సతమతమవుతుంటే.. ఒక్కదేశం మాత్రం కట్టుదిట్టమైన చర్యలతో ఒక్క మరణం కూడా నమోదు కాకుండా చూసుకోవడంలో విజయం సాధించింది. పైగా ఈ ప్రమాదకర వైరస్ పుట్టిన చైనాకు పొరుగునే ఉన్న దేశం కావడం మరో విశేషం. ఇంతకీ ఆ దేశం పేరు ఏమిటో తెలుసా? వియత్నాం. చైనా పక్కనే ఉన్న వియత్నాం.. చాలా చిన్నదేశం.

ఒక నగరం ఎంత ఉంటుందో ఈ దేశం అంత ఉంటుంది. దీని జనాభా 80 లక్షలు. అంటే మన హైదరాబాద్ కంటే కూడా చాలా తక్కువ. కానీ రాబోయే ప్రమాదాన్ని చాలా ముందుగానే పసిగట్టి నివారణ చర్యలు తీసుకోవడంలో బాగా విజయవంతమైంది. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, వియత్నాం చేపట్టిన చర్యల కారణంగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు.

చైనాలోని వుహాన్ లో గతేడాది డిసెంబర్ చివరల్లో ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో రాబోయే ఉత్పాతాన్ని వియత్నాం వెంటనే అంచనా వేసింది. ఇది ఏ మాత్రం విజృంభించినా.. వైద్య సౌకర్యాలు అంతగా లేని తమ దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని గుర్తించింది. అంతే.. తక్షణమే చైనాతో సరిహద్దును దాదాపుగా మూసివేసింది.

చైనా కూడా జనవరి 20 తర్వాత లాక్ డౌన్ ప్రకటించగా.. వియత్నాం జనవరి ఒకటో తేదీ తర్వాతే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. ప్రజలను ఇంట్లోనే ఉండాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉంటే దేశానికి సేవ చేసినట్టేనని పేర్కొంది. ఇది ఒక నినాదంలా ప్రజల్లోకి వెళ్లింది.

కరోనా బాధితులను గుర్తించడంతోపాటు వారు తిరిగిన మార్గాలు, కలుసుకున్న వ్యక్తులను గుర్తించి అంచలంచెలుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. అవసరమైనవారిని క్వారంటైన్ కు తరలించారు. దీంతో క్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నాలుగు వారాల తర్వాత లాక్ డౌన్ ఎత్తివేశారు.

వియత్నాంలో జనవరి 22న తొలి కరోనా కేసు నిర్ధారణ కాగా.. ఇప్పటివరకు 184 కేసులు పాజిటివ్ గా తేలాయి. వారిలో 21 మంది పూర్తిగా కోలుకున్నారు. మిగిలినవారికి చికిత్స జరుగుతోంది. ఒక్కరు కూడా కరోనా కారణంగా చనిపోలేదు. దీంతో ప్రపంచదేశాలు కూడా వియత్నాం తీసుకున్న చర్యల బాటలోనే వెళుతున్నాయి.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...

బర్త్‌డే స్పెషల్‌: పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్

తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎప్పటికి గుర్తుండి పోయే నందమూరి తారక రామారావు వారసత్వంతో బాల నటుడిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ చిన్న తనంలోనే రాముడిగా నటించి నిజంగా రాముడు ఇలాగే...

క్రైమ్ న్యూస్: క్వారంటైన్లో ఉండమన్నందుకు చంపేశారు..

కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇతరులను జాగ్రత్తగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిని వివరించి క్వారంటైన్ లో ఉండమన్నందుకు తనతో పాటు మరో వ్యక్తి బలైపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దారుణమైన...

కరోనా ఎఫెక్ట్: సెన్సేషన్ అయిన యుఎస్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక.!

ప్రస్తుతం ప్రపంచ జనాభాని, ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి పేరు కరోనా వైరస్. ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా భారీగా నష్టపోయింది మాత్రం ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా...

రవితేజ మూవీ క్యాన్సల్ అయ్యిందా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ ఈ సమ్మర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఎప్పటికి క్రాక్...