జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. త్వరలోనే ఇంకోసారి భీమవరంలో జనసేనాని పర్యటించే అవకాశాలున్నాయి.
ఇటీవల భీమవరంలో పర్యటించినప్పుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలైన టీడీపీ, భారతీయ జనతా పార్టీలకు చెందిన నేతల్ని కలిశారు. భీమవరంలో పోటీ విషయమై ఆయా నేతలతో చర్చించారు. వారికి కొన్ని సూచనలు చేశారు, వారి నుంచి కొన్ని సలహాలూ తీసుకున్నారు.
‘భీమవరంలో రికార్డు మెజార్టీ’ దిశగా జనసేనాని వ్యూహ రచన చేస్తున్నారు. ఎక్కడా మిత్రపక్షాలతో స్థానిక జనసేన క్యాడర్‌కి ఎలాంటి గ్యాప్ లేకుండా స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి, అన్ని వ్యవహారాలూ చక్కబెట్టారు.
గతంలో డబ్బు వెదజల్లి గెలిచారన్న విమర్శ వైసీపీ మీద వుంది. ఈసారి ఎంత డబ్బు వెదజల్లినా వైసీపీ, భీమవరంలో గెలిచే అవకాశమే లేదని కొన్ని ఇంటర్నల్ సర్వేలు కూడా వైసీపీ అధినాయకత్వానికి తేల్చి చెప్పాయట.
జనసేన – టీడీపీ కలవకూడదని వైసీపీ చివరి వరకూ ప్రయత్నాలు చేస్తూనే వుంటుంది. ఒకవేళ టీడీపీ – జనసేన కలిసినా, బీజేపీ అస్సలు కలవకూడదని ఇప్పుడు ఆ ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేస్తోంది వైసీపీ.
అయితే, జనసేనాని ఏమాత్రం ఛాన్స్ ఇవ్వడంలేదు వైసీపీకి. మొత్తం వ్యవహారం చక్కబెట్టేశారు. స్థానిక ఎమ్మెల్యే పట్ల వున్న తీవ్ర వ్యతిరేకతను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్వాంటేజ్‌గా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో భీమవరం నుంచి పోటీ చేసే జనసేనాని రికార్డు మెజార్టీ కొల్లగొట్టడం ఖాయమే కావొచ్చు.
