Switch to English

తమిళనాడులోని తెలుగు హిందూ ఓటర్లపై పవన్ కళ్యాణ్ ప్రభావమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

‘సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి.. సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం..’ అని విపరీత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ నిధి స్టాలిన్‌పై ఆయన పేరు ప్రస్తావించకుండానే తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.!

‘కొందరు సనాతన ధర్మాన్ని అంతం చేస్తామంటున్నారు.. కానీ, వాళ్ళే అంతమైపోతారు..’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అక్కడి నుంచి తమిళనాడులో రాజకీయ చర్చలు, పవన్ కళ్యాణ్ కేంద్రంగా సాగడం మొదలైంది.

తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్ల సంఖ్య ఎంత.? వారిపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రభావమెంత.? పవన్ కళ్యాణ్‌ని బీజేపీ, తమిళనాడులో తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలనుకుంటోందా.? ఏఐఏడీఎంకే – బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ బీజం వేస్తున్నారా.? ఇలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

బీజేపీ తరఫున అన్నామలై, తమిళనాడులో చాలా యాక్టివ్‌గా వున్నారు. తమిళనాడులో ఒకప్పుడు బీజేపీకి అసలు ఓటు బ్యాంకు అనేదే లేదు. ప్రస్తుతం పది శాతానికి కాస్త అటూ ఇటూగా మారిందంటే, అది అన్నామలై ప్రభావం వల్లనే. ఆ అన్నామలైకి తోడు, పవన్ కళ్యాణ్ ‘సనాతన ధర్మ పరిరక్షణ’ పోరాటం, తమిళనాడులో తెలుగు హిందూ ఓటర్లనే కాదు, సంప్రదాయ తమిళ హిందూ ఓటర్లనూ బీజేపీ వైపు చూసేలా చేస్తోంది.

నిజానికి, ఏఐఏడీఎంకే – డీఎంకే.. ఈ రెండు పార్టీల భావజాలం కూడా దాదాపు ఒక్కటే. అదే పెరియార్ భావజాలం. అయినాగానీ, సనాతన ధర్మం విషయంలో డీఎంకేతో పోల్చితే, ఏఐఏడీఎంకే కాస్త బెటర్. ఆ ఏఐఏడీఎంకే, జయలలిత మృతితో బలహీనపడినా, ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఇంకా బలంగానే వుంది.

తమిళ నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్న దరిమిలా, తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. అన్నామలై లాంటి యంగ్ లీడర్, విజయ్ లాంటి స్టార్ హీరో.. బలమైన ఓటు బ్యాంకు వున్న డీఎంకే, ఏఐఏడీఎంకే.. ఇన్ని రాజకీయ సమీకరణాల నడుమ, తమిళనాడు రాజకీయాల్లో సంప్రదాయ తెలుగు హిందూ ఓటు బ్యాంకు కూడా కీలకంగా మారబోతోంది.

కొన్ని నియోజకవర్గాల్లో ఈ ఓటు బ్యాంకు పది నుంచి పన్నెండు శాతం వరకూ వుండొచ్చన్నది ఓ అంచనా. అదే ఇప్పుడు డీఎంకే పార్టీకి పెద్ద తలనొప్పిలా మారబోతోందన్నది తమిళ రాజకీయ విశ్లేషకుల అంచనా.

అన్నట్టు, తెలుగు మీడియాతో పోల్చితే తమిళ మీడియా మరింత భిన్నం. డీఎంకే కనుసన్నల్లోనే మెజార్టీ మీడియా సంస్థలు పని చేస్తున్నాయ్. అందుకే, సోషల్ మీడియా వేదికగా తమిళ జనాలు.. సనాతన ధర్మం గురించీ, పవన్ కళ్యాణ్ గురించీ పాజిటివ్‌గా స్పందిస్తుండడం గమనార్హం.

ఈ తమిళ రాజకీయాలు మనకెందుకు.? అన్న చర్చ కొందరు జనసైనికుల్లోనూ జరుగుతున్నా, సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ గురించి దేశవ్యాప్తంగా సగటు హిందువులంతా చర్చించుకుంటూనే వున్నారు. ఆయన తెగువని కొనియాడుతూనే వున్నారు.

కొసమెరుపేంటంటే, తమిళనాడులోని తెలుగు హిందువులే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని తమిళ హిందువుల దృష్టిలోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టార్‌డమ్ అనూహ్యంగా పెరిగిపోయిందిప్పుడు.! సనాతన ధర్మ పరిరక్షణ కోసం నినదిస్తూనే, ఇతర మతాల్ని సైతం అంతే బాధ్యతగా గౌరవిస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు.. ఆ కోణంలోనూ ఆ వర్గాల్లోనూ ప్రశంసల్ని పొందుతున్నాయి.

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

పిఠాపురం నుంచే మార్పు మొదలు కావాలి: రూల్ బుక్ తప్ప మరో మాట లేదు

పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన ‘మోడల్ పిఠాపురం’...

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం

పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...

Daily Horoscope: మేషం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది – తులలో కీలక నిర్ణయాలు

జనవరి 15, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ముందడుగు వేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఒక మంచి ఆలోచన...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది....

భర్తల జీవిత ప్రశ్నకు సమాధానం చెప్పే సినిమా: కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో, దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, ఎస్ఎల్‌వి సినిమాస్...