Switch to English

సీఎం వైఎస్‌ జగన్‌.. తప్పించుకు తిరిగేది.. ఇంకెన్నాళ్ళు.?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు.. ఆ పథకం అంటున్నారు, ఈ పథకం అంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఊదరగొట్టేస్తున్నారు. ప్రారంభోత్సవాలు.. అభివృద్ధి కార్యక్రమాలంటూ హడావిడి చేసేస్తున్నారు. కానీ, రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తలెత్తుతున్న ఆందోళనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెదవి విప్పడంలేదు.

ఒకటీ అరా సందర్భాల్లో అలా లైట్‌ లైట్‌గా టచ్‌ చేసి ఊరుకుంటున్నారు తప్ప, రైతుల సమస్యలపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రికి మనసొప్పడంలేదాయె. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి పెద్ద దిక్కు. కాదు కాదు, వున్న ఒకే ఒక్క దిక్కు.. ముఖ్యమంత్రి మాత్రమే ఏ రాష్ట్రానికి అయినా. అలాంటి ముఖ్యమంత్రి కాకపోతే, అమరావతి రైతుల ఆవేదనను అర్థం చేసుకునేదెవరు.? వారి బాధల్ని తీర్చేదెవరు.? బోల్డంత భద్రత నడుమ.. వీలు చిక్కినప్పుడల్లా అమరావతిలో అధికారిక కార్యకలాపాల కోసం చక్కర్లు కొడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

కానీ, ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినట్లు.. ‘ఏ అవ్వనీ, ఏ తాతనీ..’ కారు దిగి పలకరించడంలేదాయె. గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారో.. ఇతరత్రా సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారో.. కారణం ఏదైతేనేం.. చాలామంది అమరావతి కోసం ఆందోళనలు చేస్తూ ప్రాణం విడుస్తున్నారు. అయినాగానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మనసు కరగకపోవడం గమనార్హం. ‘అమరావతి ఎక్కడికీ వెళ్ళిపోదు..’ అని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఆ ప్రభుత్వంలో వున్నవారే, అమరావతి రైతుల్ని అవమానిస్తున్నారు ‘పెయిడ్‌ ఆర్టిస్టులు’ అంటూ.

ఇంటెలిజెన్స్‌ ఇన్‌పుట్స్‌.. అమరావతిలో ఏం జరుగుతోందో చెప్పకుండా వుంటాయా.? రైతులతో మాట్లాడి, వారి సమస్యలకి పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి స్థాయిలో హామీ గనుక ప్రభుత్వం నుంచి వస్తే.. అమరావతిలో ఆందోళనలు కొంతమేర సద్దుమణిగే అవకాశం వుంటుంది. కానీ, ‘నాకేంటి సంబంధం.?’ అంటూ లైట్‌ తీసుకుంటే మాత్రం.. తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో అందరం చూశాం.. అదే అమరావతి విషయంలోనూ జరగొచ్చు. ప్రజల ఉసురు ఏ ప్రభుత్వానికీ మంచిది కాదు. అధికారంలో ఎవరున్నా సరే.. వాళ్ళంతా ప్రజలకు సేవకులు మాత్రమే. పాలకులమన్న గర్వం నెత్తికెక్కితే.. చరిత్ర క్షమించదు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

సపోర్ట్‌ రంగనాయకి మేడమ్: ఎవరీమె.! ఎందుకీ రగడ.?

సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్‌లో వున్న హ్యాష్‌ట్యాగ్‌ ‘సపోర్ట్‌ రంగనాయకి మేడమ్’. ఎవరీమె.? ఎందుకు ఈమె పేరు ఇప్పుడు ఇంతలా పాపులర్‌ అవుతోంది.? అంటే, ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విష వాయువు...

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...

రంజాన్‌ స్పెషల్‌: ‘హలీం’కి ఊరట దక్కేనా.?

హలీం.. రంజాన్‌ స్పెషల్‌ వంటకం ఇది. కేవలం ముస్లింలకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చెందిన భోజన ప్రియుల్నీ తనవైపుకు తిప్పుకున్న ప్రత్యేక వంటకంగా హలీం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడో విదేశాల్లో పుట్టి,...

బర్త్ డే స్పెషల్: రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను...

పూరి నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హీరో ఎవరు?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైలాగ్స్ ఎలా అయితే బుల్లెట్స్ లా ఉంటాయో, సినిమాలు కూడా అంతే స్పీడ్ గా ఉంటాయి. అంతకన్నా స్పీడ్ గా సినిమా షూటింగ్స్ ని కూడా ఫినిష్...