వైసీపీ హయాంలోనూ వైసీపీ నేతలు వీధి రౌడీల్లా వ్యవహరించారు.. టీడీపీ హయాంలోనూ వైసీపీ నేతలే వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.! అలాంటప్పుడు, ఇది మంచి ప్రభుత్వమెలా అవుతుంది.? ఓ టీడీపీ కార్యకర్త, సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని సంధించిన ప్రశ్న ఇది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వీళ్ళతోపాటు, పోలీస్ శాఖని కూడా ట్యాగ్ చేస్తూ పై ప్రశ్నను సంధిస్తున్నారు నెటిజనం. ఇందులో సాధారణ ప్రజానీకం కూడా ఎక్కువగానే వున్నారు.
యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న కారణంతో, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని తీసుకెళుతుండగా, ఎలా వచ్చారోగానీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్, మెరుపులా దూసుకొచ్చి.. కిరణ్‌పై దాడికి యత్నించారు.
గోరంట్ల మాధవ్ గతంలో ఎంపీగా పని చేశారు. అంతకు ముందు ఆయన ఒక పోలీస్ అధికారి కూడా. పోలీస్ అధికారిగా పని చేసిన గోరంట్ల మాధవ్, పోలీసుల అదుపులో వున్న నిందితుడిపై దాడి చేయకూడదని తెలుసుకోలేనంత అమాయకుడా.?
అనంతపురం జిల్లాకి చెందిన గోరంట్ల మాధవ్‌కి గుంటూరులో వున్న చేబ్రోలు కిరణ్ అరెస్టు గురించి ఎప్పుడు సమాచారం అందింది.? ఎలా అంత వేగంగా, ఆయన వచ్చేసి.. పోలీసుల అదుపులో వున్న కిరణ్ మీద దాడికి యత్నించగలిగారు.?
పోలీసు శాఖనే ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన ఇది. గోరంట్ల మాధవ్‌ని పోలీసులు నిలువరించగలిగారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు కూడా.
ఒకవేళ గోరంట్ల మాధవ్ దాడి చేసి వుంటే.? చేబ్రోలు కిరణ్ ప్రాణాలు కోల్పోయి వుంటే.? పోలీసు శాఖ మీద ఎంత పెద్ద మచ్చ పడి వుండేది.? ప్రభుత్వానికి అది ఎంత శాపంగా మారేది.?
అన్నట్టు, చంద్రబాబు, నారా లోకేష్ మీద అత్యంత అసహ్యకరమైన రీతిలో రెచ్చిపోయారు గోరంట్ల మాధవ్, తాను ఎంపీగా వున్న సమయంలో. ఆయన ఈ రోజు, చేబ్రోలు కిరణ్ మీద దాడికి యత్నించడమంటే, అంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఇంకేముంటుంది.?
