కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏ తండ్రైనా చూస్తూ ఎలా ఊరుకోగలడు. తన ప్రాణాలైనా పణంగా పెట్టి కాపాడాలనుకుంటాడు కదా. ఒక హాలీవుడ్ నటుడు కూడా ఇలాగే కొడుకు ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాలను కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మాజీ రెజ్లర్ షాద్ గాస్పార్డ్ బీచ్ వద్ద సముద్రంలో ఈతకు తన కొడుకుతో పాటు వెళ్ళాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక బీచ్ వద్ద జరిగిన ఈ ఘటనలో షాద్ గాస్పార్డ్ ప్రాణాలు కోల్పోయాడు.
వినీఎస్ మెరీనా బీచ్ లో సముద్రంలో ఆయన కొట్టుకుపోయి సముద్రతీరానికి మృతదేహం కొట్టుకువచ్చిందని అక్కడి అధికారులు వెల్లడి చేసారు. ఇన్నాళ్లూ కరోనా వైరస్ కారణంగా అక్కడి బీచ్ లను మూసివేశారు. అయితే ఈ మధ్యనే వాటిని ఓపెన్ చేయడంతో షాద్ గాస్పార్డ్ తన కొడుకు ఆర్యేహ్ తో కలిసి బీచ్ కు వెళ్లి ఈత కొడుతుండగా అలలు వచ్చి తండ్రీ కొడుకులను లాక్కుపోయింది.
దాంతో అక్కడి గార్డ్స్ రక్షించడానికి వచ్చినప్పుడు తన కొడుకును ముందు రక్షించమని చెప్పి కొడుకును ముందు తోసాడు. తీరా గార్డ్స్ కొడుకును రక్షించి తండ్రి వద్దకు వచ్చేటప్పటికే అలలు లాక్కెళ్లిపోయాయి.
873393 523045Thank you for every other informative site. Where else could I get that type of info written in such a perfect means? Ive a mission that Im just now operating on, and Ive been at the look out for such information. 682181
433606 818513There is noticeably a bundle comprehend this. I suppose you created specific nice points in functions also. 961886