అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుండగా.. 4వ తేదీ అర్ధరాత్రి నుంచి కూడా బెనిఫిట్ షోలు పడనున్నాయి. దీంతో ఈ సినిమా టిక్కెట్ ధరలు భారీగా పెరుగుతాయని అంతా భావిస్తున్నారు. టికెట్ ధరలు, అదనపు షోలు పెంచాలని మూవీ టీమ్ తెలంగాణ సర్కారును సంప్రదించగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవో విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం..
డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలకు, అర్ధరాత్రి 1 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చారు. పుష్ప2 బెనిఫిట్ షోల టిక్కెట్ ధరలను రూ.800 పెంచేందుకు అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9.30 గంటలకు జరిగే షోకు మాత్రమే సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లలో బెనిఫిట్ షోలకు రూ.800 టికెట్ ధరకే అనుమతి ఇచ్చారు. తెల్లవారుజామున 1 గంటలకు, తెల్లవారుజామున 4 గంటలకు చూపించే షోలకు షోలకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపునకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపునకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 పెంచేందుకు అనుమతి ఇచ్చారు.
తెలంగాణలో భారీగా పెరిగిన పుష్ప2 టికెట్ రేట్లు
మొదటి నాలుగు రోజులు, టిక్కెట్ రేటు గరిష్టంగా రూ.300 సింగిల్ స్క్రీన్‌లలో.. గరిష్టంగా రూ.495 మల్టీప్లెక్స్‌లలో ఉండనున్నాయి. ఆ తర్వాత వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో 255 వరకు, మల్టీప్లెక్స్‌లలో 445 వరకు టికెట్ రేటు ఉంటుంది. ఆ తర్వాత వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లలో 170 వరకు, మల్టీప్లెక్స్‌లలో 345 వరకు టికెట్ రేటు ఉంటుంది. వీటితో పాటు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే అదనపు ఛార్జీలు ఉంటాయి. బెనిఫిట్ షో ఎక్కడ చూసినా 1100 ఫిక్స్ చేయడంతో రేటు ఎక్కువ అని అభిమానులు, ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.