ఉన్నత న్యాయస్థానానికి చికాకేస్తోందిట. అధికారులు పదే పదే కోర్టు ధిక్కరణ కేసుల నిమిత్తం, కోర్టు బోనులో నిల్చోవాల్సి రావడంపై ఉన్నత న్యాయస్థానమే ‘చికాకు’ వ్యాఖ్యలు చేసిందంటే, వీటిపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు.? అధికారుల్ని జనం ఇంకెంతలా అసహ్యించుకుంటారు.?
పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు.. ఆ మాటకొస్తే, ఏ శాఖ ఉన్నతాధికారులైనాసరే.. కోర్టు ముందర క్యూ లైన్లలో నిల్చోవాల్సిందేనేమో.. అన్నట్టు తయారైంది పరిస్థితి. బిల్లుల చెల్లింపు దగ్గర్నుంచి, అక్రమ కేసులు బనాయించడం వరకు.. ప్రతి విషయంలోనూ ఉన్నత న్యాయస్థానం.. అధికార యంత్రాంగానికి మొట్టికాయలేస్తోంది.
పరిపాలించేది ముఖ్యమంత్రి.. కానీ, ఆ ముఖ్యమంత్రి కోర్టు బోనెక్కరు కదా.? ఆ ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా నిబంధనల్ని తుంగలో తొక్కే అధికారులే బలైపోతారు. అదే జరుగుతోంది. అందుకే, అధికారులు.. పద్ధతి ప్రకారం వ్యవహరించాలి.. రూల్స్ ఫాలో అవ్వాలి.. అంతేగానీ, రాజకీయ నాయకుల్ని ఫాలో అవకూడదు.
ఉదాహరణకి.. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఓ ఆడియో క్లిప్ పంపించారట.. పోలీస్ ఉన్నతాధికారి.. అదీ ఇంటెలిజెన్స్ శాఖ అధికారి. ఆ ఆడియో క్లిప్ వ్యవహారంపై ‘ట్యాపింగ్’ ఆరోపణలు చేశారు సదరు వైసీపీ ఎమ్మెల్యే. అసలు ఇంటెలిజెన్స్ శాఖ ఉన్నతాధికారి, ఎమ్మెల్యేకి ఆడియో క్లిప్ పంపి, ‘జాగ్రత్తగా వుండండి’ అనడమేంటి.?
ప్రస్తుతానికి ఈ వ్యవహారం కోర్టుకెక్కలేదు. కోర్టు ముందరకు ఈ విషయం వెళితే, సదరు ఉన్నతాధికారి పరిస్థితేంటి.? ఎవరు ఆ ఆడియో క్లిప్ ఎమ్మెల్యేకి పంపాలని ఆ ఉన్నతాధికారికి సూచించినట్లు.? ప్రభుత్వ పెద్దల మనసెరిగి వ్యవహరించిన సదరు పోలీస్ ఉన్నతాధికారి.. ప్రజా రక్షకుడా.? ప్రభుత్వంలో వున్నవారికి పాలేరుతనం చేస్తున్నారా.? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా వుండదు కదా.?
ఇక, బటన్ నొక్కి సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల విషయంలో కూడా అలాగే ముఖ్యమంత్రి బటన్ నొక్కితే, అధికారులు.. కోర్టు మెట్లెక్కే పరిస్థితి రాదు కదా.? రాజకీయ నాయకులంటే జనానికి చీదర వేయడం కొత్త కాదు. ఇప్పుడేమో, అధికారులంటే అసహ్యం వేసే పరిస్థితి వైసీపీ తెచ్చిందన్నమాట. అధికారులకే ఆ విషయం ఇంకా అర్థం కానట్టుంది.
699644 262497You recognize, many individuals are looking round for this info, you can aid them greatly. 876226
738444 772157Right wow messages are bound to show your and supply memorialize the speacial couple. Beginner sound system to high in volume crowds ought to always take a look at all of the wonderful value behind presenting and public speaking, which is to be someones truck. best man speeches brother 718155