ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్ లేదంటే సల్మాణ్ ఖాన్ అనే పేర్లే ప్రధానంగా వినిపిస్తుంటాయి కదా.. కానీ వీళ్లకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో కూడా ఉన్నాడు. ఆయనే దళపతి విజయ్. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ కు పేరుంది. 50ఏళ్ల ఈ హీరో ఇప్పుడు కెరీర్ లోనే చివరి సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పొలిటికల్ పార్టీని ప్రకటించిన ఆయన.. త్వరలోనే ఫుల్ టైమ్స్ పాలిటిక్స్ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
కాబట్టి ఇదే తన చివరి సినిమా అని ప్రకటించారు. ఈ సినిమాకు దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీన్ని హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.250 కోట్లు తీసుకుంటున్నారంట. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇంత పెద్ద మొత్తంలో తీసుకోలేదు. ఆయన గోట్ సినిమాకు ఏకంగా రూ.200 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో యాభై కోట్లు ఎక్కువ తీసుకుంటున్నాడు విజయ్. అటు ప్రొడ్యూసర్లు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు వెనకాడట్లేదు. ఎందుకంటే విజయ్ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాడు.
ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. దీంతో ఇండియాలోనే అత్యధికంగా తీసుకుంటున్న హీరోగా విజయ్ రికార్డు సృష్టించాడు. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయిలో పాలిటిక్స్ లోనే ఉండబోతున్నాడు. త్వరలోనే ఆయన కొడుకు హీరోగా పరిచయం అవుతాడనే ప్రచారం జరుగుతున్నా.. అతను మాత్రం డైరెక్టర్ గా చేయాలని అనుకుంటున్నాడంట. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.