Pushpa 2: అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈనేపథ్యంలో సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిందని.. విడుదల నిలుపుదల చేయాలంటూ శ్రీశైలం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. అన్ని మార్పులు సూచించిన తర్వాతే సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశామని సెన్సార్ బోర్డు తరపు లాయర్ కోర్టుకు విన్నవించారు.
అనుమానాలను ఆధారాలుగా తీసుకుని సినిమా నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. కోర్టు సమయం వృధా చేసారంటూ పిటిషనర్ కు జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్ధకు అందించాలని ఆదేశించింది.
మరోవైపు బెనిఫిట్ షోలకు టికెట్ పై అదనంగా 800.. మొదటి 15రోజులకు అధికంగా వసూలు చేస్తున్నారంటూ మరో పిటిషన్ దాఖలైంది. పెంచిన రేట్లు అభిమానుల కోసమని కుటుంబాలు బెనిఫిట్ షోలకు రారని నిర్మాత తరపు లాయర్ విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ డిసెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. దీంతో పుష్ప2 టికెట్ రేట్లు ప్రభుత్వం అనుమతించినవే కొనసాగనున్నాయి.