పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా చెప్పారు. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా.. వాటికి మంచి ఆదరణ దక్కిందని.. ట్రైలర్ తో పాటే మూడో పాటను కూడా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ తెలిపింది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాను క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీ మొదలై చాలా ఏళ్లు గడుస్తోంది. కానీ పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో బిజీ అవడంతో వాయిదా పడింది. ఆ తర్వాత డేట్లు కేటాయిస్తూ దీన్ని కంప్లీట్ చేశారు. ప్రస్తుతానికి సినిమా పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇక నుంచి వరుసగా ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నారు. ట్రైలర్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తారు. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఇది పీరియాడికల్. గతంఓల పవన్ ఇలాంటి పాత్రలో నటించలేదు. త్వరలోనే పవన్ కల్యాణ్ ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది.
