రౌండప్ చేయకు .. ఆ కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాను ! అంటూ మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తుందిగా .. ఇప్పుడు అదే సంఘటన అయన రీల్ లైఫ్ లో జరుగుతుంది. ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరు మాజీ క్రేజీ హీరోయిన్స్ ఆయన్ను సెంటర్ చేయనున్నారట? ఇంతకీ విషయం ఏమిటా ? అని షాక్ అవుతున్నారా ! అయితే అసలు విషయంలోకి వెళదాం.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మహర్షి ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తరువాత అయన నటించే 26వ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. పక్కా ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో ఇద్దరు మాజీ హీరోయిన్స్ కీ రోల్స్ పోషిస్తున్నారట. అందులో ఒకరు రమ్యకృష్ణ అయితే మరో మాజీ హీరోయిన్ విజయ శాంతి.
చాలా కాలం తరువాత విజయ శాంతి నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాలో విజయశాంతి, మహేష్ కి అత్త పాత్రలో కనిపిస్తుండగా .. రమ్యకృష్ణ తల్లిగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అంటే అత్తా .. అమ్మల మధ్య నలిగే వ్యక్తిగా మహేష్ కనిపిస్తాడన్నమాట. అసలే ఇద్దరు మాజీ హీరోయిన్స్ ! వీరి మధ్యలో మహేష్ ఇరుక్కున్నాడంటే.. తప్పకుండా ఇత్తడి అవ్వాల్సిందే. అన్నట్టు జగపతిబాబు కూడా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ ఎవరన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మద్యే ఎఫ్ 2 లాంటి సంచలన విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి నుండి వస్తున్న మరో ఫ్యామిలీ ఫన్ ఎంటర్ టైనర్ ఇది.
ఈ చిత్రానికి సరిలేరు నీకెవ్వరూ అన్న టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ లో పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఓ వైపు .. అత్తా .. మరో వైపు తల్లి .. పాత్రల మధ్య నలిగే యువకుడి కష్టాలు ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఫన్ అందిస్తుందన్నమాట. సో దీనికి సంబందించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.