సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యా సాగర్ ఇటీవల మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి సినిమా పరిశ్రమలో అందరికి షాకింగ్ అని చెప్పాలి. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం విచారకరం. ఆయన మృతి విషయమై కుటుంబ సభ్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన ఏ కారణంతో చనిపోయాడు అనే విషయాన్ని స్పష్టంగా వైధ్యులు కూడా వెళ్లడించలేదు. కాని మీడియాలో మాత్రం పుంకాను పుంకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. దాంతో మీనా స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
దయచేసి తన భర్త విద్యాసాగర్ మృతికి సంబంధించి పుకార్లను ప్రచారం చేయవద్దంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలో తాము చాలా బాధలో ఉన్నాం. అలాంటి పుకార్లతో మా బాధ మరింత పెరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో విద్యా సాగర్ కు వైద్య సహాయం అందించిన వైధ్యులకు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా ఆరోగ్య శాఖ మంత్రికి కూడా మీనా దన్యవాదాలు తెలియజేసింది.