Switch to English

‘హ్యాపీ బర్త్ డే’లో పాత్రలన్నీ హీరోలే.. సర్రియల్ కామెడీ సినిమా: లావణ్య త్రిపాఠి

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హ్యాపీ బర్త్ డే”. రవిశంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాణంలో సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కింది. సినిమా జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా లావణ్య త్రిపాఠి మీడియాతో “హ్యాపీ బర్త్ డే” చిత్ర విశేషాలను పంచుకున్నారు.

మొదటి సారి గన్ పట్టుకున్నా..

సినిమాలో మొదటి సారి గన్ పట్టుకున్నాను. 9 కేజీల బరవున్న గన్స్ క్యారీ చేయడం కష్టం అనిపించింది. మేకప్ కూడా. చాలా కొత్తగా అనిపించింది. కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సహజంగానే జిమ్, బాక్సింగ్ చేయడంతో మొదటిసారి స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశం ‘హ్యాపీ బర్త్ డే’తో దక్కింది. సినిమా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. హ్యాపీ అనే పాత్ర చేశాను. కథలో కీలకంగా వుంటుంది. ‘హ్యాపీ’ పాత్రలో పాత్రలో చాలా ఫన్ వుంది. ఫోర్స్ కామెడీ వుండదు. చాలా ఈజీగా చేశాను.

లీడ్ రోల్ నాదే..

దర్శకుడు రితేష్ రానా కథ చెప్పినపుడు చాలా నచ్చింది. కొత్త జోనర్. సర్రియల్ వరల్డ్ థాట్ ఎక్సయిట్ చేసింది. ఫీమేల్ ఓరియెంటెడ్ అంటే సీరియస్ గా వుండే పాత్రలే వస్తుంటాయి. కానీ ఇలాంటి లీడ్ రోల్ రావడం ఆనందంగా ఉంది. నన్ను దృష్టిలో పెట్టకునే హ్యాపీ పాత్రని రాశారు. ఈ విషయంలో లక్కీగా ఫీలౌతున్నా. మొదటి సినిమా అందాల రాక్షసిలో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. తర్వాత చేసిన పాత్రలన్నీ కేక్ వాక్ లానే చేశాను. చాన్నాళ్ల తర్వాత ‘హ్యాపీ’ పాత్ర కొత్తగా అనిపించింది.

నెంబర్ వన్ అందరికీ సాధ్యం కాదు..

పదేళ్ళుగా ఇండస్ట్రీలో ఉండటం గొప్ప ఆనందం. నెంబర్ వన్ అందరికీ సాధ్యం కాదు. నా వర్క్ ని ఎంజాయ్ చేస్తున్నాను. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. నా ప్రయాణం సంతృప్తికరంగా వుంది. కథల ఎంపికలో కొంచెం పర్టిక్యులర్ గా వుంటాను. నటిగా బలమైన పాత్రలు చేయాలని సెలక్టివ్ గా వెళ్లడంతో సినిమాలు తగ్గించినట్లు అనిపించవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి పాత్రలే చేయాలని అలోచించను. కానీ.. నాకు యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. ప్రస్తుతం తమిళ్ లో అథర్వ తో ఓ సినిమా చేస్తున్నా. దాదాపు పూర్తయింది.

యూనిక్ కథ..

హ్యాపీ బర్త్ డే సర్రియల్ ప్రపంచంలో జరుగుతుంది. ఎలాంటి హద్దులు వుండవు. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న వుండదు. అది ఊహజనితం. సినిమాలో ఇది యునిక్ గా వుంటుంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ తో కలసి పనిచేయడం ఆనందంగా వుంది. చెర్రీ గారు అద్భుతమైన నిర్మాత. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. హ్యాపీ బర్త్ డేని భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. హ్యాపీ బర్త్ డేలో పాత్రలన్నీ హీరోలే. క్యారెక్టర్ బేస్డ్ కథ ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: మహేశ్-పూరి కాంబోలో టాలీవుడ్ గేమ్ చేంజర్...

బాల నటుడిగా నిరూపించుకున్న మహేశ్ బాబు పూర్తిస్థాయి హీరోగా ఫుల్ ఛార్మింగ్ లుక్, రొమాంటిక్, పాల బుగ్గల మేని ఛాయతో తెలుగు సినిమాకు గ్లామర్ తీసుకొచ్చారు....

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: స్లో డ్యాన్సులతో ట్రెండ్ సెట్ చేసిన...

ఎప్పుడైతే చిరంజీవి స్పీడ్ ఫైట్లు, బ్రేక్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా వినోదం అందించారో ప్రేక్షకులు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఆశిస్తూనే...

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల...

ఇదీ బాస్ అంటే.. ఇదీ వ్యక్తిత్వం అంటే.. అందుకే ఆయన మెగాస్టార్..

నిన్న బింబిసార సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ వచ్చిన విషయం అందరికీ సంతోషం కలిగించింది.. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఫాన్స్ పేరుతో కొందరు...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

రాజకీయం

అంతేనా.? గోరంట్ల మాధవ్ మీద ‘వేటు’ పడే అవకాశమే లేదా.?

అదేంటీ, గోరంట్ల మాధవ్ మీద వేటు పడుతుందనే ప్రచారం వైసీపీనే చేసింది కదా.? ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేటీఎం కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు కదా.? కఠిన...

బింబిసార ముసుగులో బులుగు రాజకీయం… టీడీపీ జనసేన మధ్య వైసీపీ చిచ్చు.?

మెగాస్టార్ అనే ట్యాగ్‌ని కళ్యాణ్ రామ్‌కి ఎలా ఇచ్చేస్తారు.? ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. నిజానికి, ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. జనసైనికులూ పెద్దగా...

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: యమలోకం కథలో చిరంజీవి వన్ మ్యాన్ షో ‘యముడికి మొగుడు’

1978లో తన తొలి సినిమాలో నటుడిగా పరిచయమైన చిరంజీవి 1988కి సుప్రీం హీరో అయిపోయారు. ఈ పదేళ్లలో డ్యాన్సులు, ఫైట్లతో అశేష ప్రేక్షకాభిమానుల్ని సంపాదించుకుని తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. ఈకోవలో...

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

ఇదెక్కడి న్యాయం రాజు గారు?

ఆగస్టు 1 నుండి టాలీవుడ్‌ లోని అన్ని షూటింగ్‌ లను నిలిపి వేయాలంటూ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీర్మానించింది. అదే విధంగా షూటింగ్స్ ను నిలిపి వేయడం జరిగింది. కాని కొన్ని సినిమాల...

బండ్లపై ఆ నిర్మాతలు సీరియస్‌

యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు అయ్యి పెరిగిన సినిమాల బడ్జెట్‌ ను తగ్గించడంతో పాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టార్‌...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...