నువ్వు నాకు నచ్చావ్, నరసింహానాయుడు, ప్రేమతో రా.. వంటి పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ ఆశా సైనీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇన్ స్టా వేదికగా గుడ్ న్యూస్ చెప్తూ.. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది. అయితే.. ఇంత ఆనందం వెనుక ఓ బాధ ఉందని చెప్పింది. 20ఏళ్ల వయసులో ఓ నిర్మాతతో ప్రేమలో ఉన్నానని అతను తనను చిత్రహింసలకు గురి చేశాడని షాకింగ్ విషయాలు బయటపెట్టింది.
20ఏళ్ల వయసులోనే పది సినిమాల్లో నటించాను. డిజైనర్స్ బ్రాండ్స్ కు మోడలింగ్ చేశాను. అయితే.. ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డాను. అదే తప్పైంది. కొద్దిరోజులకే అతడు నన్ను వేధించాడు. ముఖం, పొట్ట, ప్రైవేట్ భాగాలపై కొట్టాడు. సినిమాల్లో నటించొద్దని.. నా ఫోన్ లాక్కున్నాడు. ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాను. నిర్మాత పెట్టిన బాధల నుంచి బయటకొచ్చేందుకు చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆనందంగా ఉన్నాను. ప్రేమను వెతుక్కున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని కోరింది.
507404 978988Pretty! This was a truly wonderful post. Thank you for your provided info. cool desktop 442208