Thangalaan: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా “తంగలాన్”. పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయవాడలో పర్యటించారు.
హీరో విక్రమ్.. ‘తంగలాన్ మంచి అడ్వెంచరస్ మూవీ. తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాను ఎంతగానో ఆదరిస్తారు. ప్రేక్షకులందరికీ నచ్చే ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. డైరెక్టర్ రంజిత్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవాడ రావడం హ్యాపీగా ఉంది. ‘అపరిచితుడు’లానే ‘తంగలాన్’ను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాన’ని అన్నారు.
హీరోయిన్ మాళవిక మోహనన్.. ‘తంగలాన్’ లో ‘ఆరతి’ అనే క్యారెక్టర్ చేశాను. నా కెరీర్ లో బెస్ట్ రోల్. కష్టపడి నటించాను. ఇటువంటి గొప్ప సినిమాలో నటించడం సంతోషంగా ఉంద’ని అన్నారు.