బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా వంటి స్టార్స్‌పైనా కేసులు నమోదు అయ్యాయనే వార్తలు వచ్చిన నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయలేదని, ఆయన ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్నాడని టీం మెంబర్స్ ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. తాజాగా అదే దారిలో రానా పీఆర్ టీం సైతం ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. రానా ఎలాంటి ఇల్లీగల్ పనులకు పాల్పడలేదని అందులో పేర్కొన్నారు.
నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు గాను రానా గతంలో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం 2017లోనే ముగిసింది. ప్రస్తుతం రానా ఎలాంటి గేమ్ లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం లేదు, అంతే కాకుండా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌కి అంబాసిడర్‌గా లేడని వారు పేర్కొన్నారు.
గతంలోనూ, ఇప్పుడు రానా చట్ట విరుద్దంగా ఏం చేయలేదని, పూర్తిగా చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా గతంలో రానా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు కమిట్ అయ్యారు. చట్టపరమైన సమీక్షల తర్వాతే రానా ఎప్పుడైనా పని చేశారు. కనుక రానాపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనే ప్రచారం సరైనది కాదని అన్నారు.