ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మహేశ్ బాబు పి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ప్రతి సినిమా కోసం కొత్త లుక్ ను ట్రై చేస్తుంటాడు హీరో రామ్. ఇక తాజాగా ఆయన కొత్త సినిమా కోసం చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు. సాగర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఈ పాత్ర లుక్ ను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇందులో ఆయన చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. చాలా యంగ్ గా ఫ్రెష్ గా ఉన్నాడు.
దీంతో కథ కూడా యూత్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక మూవీ రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీ రామ్ కు 22వది. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్ ప్రారంభం సందర్భంగా హీరో లుక్ ను రిలీజ్ చేస్తూ.. ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు. మహేశ్ బాబు రామ్ ను వింటేజ్ లుక్ లో చూపిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. కథ, కథనం కూడా సరికొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తోంది. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.