మాస్ మహారాజ్ ఇంటి నుంచి వారసుడు రాబోతున్నాడు. ఆయన తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా “మిస్టర్ ఇడియట్”. ఈ మూవీని జె జే ఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఇప్పటికే పాటలు విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో సాంగ్ అయిన ‘కాంతార కాంతార’ లిరికల్ సాంగ్ ను తాజాగా హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు ఆయన బెస్ట్ విషెస్ తెలిపాడు.
అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఎనర్జిటిక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. ‘ఎందుకె చిట్టి నువ్వు ఇట్లా పుట్టినావు మందిని సంపుతావు ఏందే, మా లెక్కనే నీకు రెండు కాళ్లు చేతులు ముక్కు మూతి ఉన్నయి గాదె అంటూ సాగుతున్న ఈ సాంగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ కు రీల్స్ కూడా వస్తున్నాయి. హీరోయిన్ వెంట హీరో పడే క్రమంలో ఈ సాంగ్ ను రూపొందించినట్టు తెలుస్తోంది.
ఇక మిస్టర్ ఇడియట్ మూవీ డిసెంబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. మంచి ఫీల్ గుడ్ కథతో వస్తున్నామని ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించింది. యూత్ కు నచ్చే కమర్షియల్ అంశాలు కొత్తగా తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. మరి మూవీ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.
wonderful post, very informative. I ponder why the other specialists
of this sector do not understand this. You must proceed your writing.
I’m sure, you have a great readers’ base already!