మెగాస్టార్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెల 2న విడుదలకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ గా విడుదలకు ప్లాన్ చేసారు.
దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా డిజిటల్ సాటిలైట్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. డిజిటల్ హక్కులు, ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఏకంగా 40 కోట్లు డిమాండ్ పలుకుతుందట. దాంతో పాటూ నైజం హక్కుల కోసం ఏకంగా 40 కోట్ల భారీ అఫర్ కూడా వచ్చిందని టాక్.
తాజాగా ఓవర్ సీస్ హక్కులను భారీ రేటుకు ఫార్స్ ఫిలిమ్స్ దక్కించుకుంది. ఈ ఓవర్ సీస్ హక్కుల కోసం ఈ కంపెనీ 18 కోట్లు అఫర్ ఇచ్చిందట. ఓవర్ సీస్ మార్కెట్ రేంజ్ లో ఇది భారీ రేటే. దాంతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ థియేట్రికల్ రైట్స్ కూడా దాదాపు పూర్తయ్యాయని సమాచారం. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా సందర్బంగా విడుదల చేస్తున్నారు.
