కొన్నిరోజులుగా హెచ్‌సీఏలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు నోటీసుల వ్యవహారం చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన స్పందించారు. ‘నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. అపెక్స్ కౌన్సిల్‌కు నాపై అనర్హత వేసే హక్కు లేదు. అంబుడ్స్‌మెన్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని అంబుడ్స్‌మెన్ రద్దు చేసి ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేస్తా. అవినీతికి పాల్పడుతున్న సభ్యులపై సీబీఐ విచారణ జరపాలి’.
‘25ఏళ్ళుగా హెచ్‌సీఏను కొందరు దోచుకుంటున్నారు. కోట్లలో ఫండ్స్ వస్తున్నా ఉప్పల్ స్టేడియం తప్ప ఒక్క గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయలేదు. వారి అవినీతికి అడ్డుపడుతున్నాను కాబట్టే నాపై తిరుగుబాటు చేస్తున్నారు. భవిష్యత్తులో బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తా’ అని అజారుద్ధీన్ అన్నారు. హెచ్‌సీఏపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తనకు తెలియదన్నారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని కవిత పోటీ చేసినా తప్పేం లేదని ఈ సందర్భంగా అన్నారు.
674990 685750I undoubtedly did not realize that. Learnt something new today! Thanks for that. 185071
675533 15183Extremely instructive and very good bodily structure of subject matter, now thats user pleasant (:. 675086