Switch to English

పవన్‌ కళ్యాణ్‌ సినిమా.. వారిని అంతలా భయపెడ్తోందా.?

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా మూడు సినిమాలు చేసేస్తున్నారు. ‘మీరు సరిగ్గా పరిపాలించండి.. నేను రాజకీయాలొదిలేసి సినిమాలు చూసుకుంటాను..’ అని ఓ సందర్భంలో పవన్‌, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సవాల్‌ విసిరిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే, ఆయన గతంలోనూ ఈ వ్యాఖ్యలు చేశారు.. అంటే చంద్రబాబు హయాంలో.

అయితే, పరిస్థితులు మారాయి. రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో పవన్‌ కళ్యాణ్‌కి, ఇటీవలి ఎన్నికల తర్వాత ఇంకా బాగా తెలిసొచ్చింది. అందుకే, మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళారు. అలాగని ఆయనేం రాజకీయం మానేయలేదు. రాజకీయ పార్టీని నడపడం కోసం అవసరమై నిధుల్ని సేకరించుకోవాలి కాబట్టి, వక్రమార్గంలో కాకుండా.. సక్రమ మార్గంలో ఆయన ఈ ఆలోచన చేశారు.

ఇక, పవన్‌ కొత్త సినిమా మే నెలలో విడుదల కాబోతోంది. ఫస్ట్‌ లుక్‌ విడుదలకు రంగం సిద్ధమయ్యింది. ఇకనేం, పవన్‌ మీద విమర్శలు షురూ అయ్యాయి. ఈ సినిమాతో పవన్‌ జెండా ఎత్తేయడం ఖాయమని సోషల్‌ మీడియాలో కొందరు ‘హేటర్స్‌’ దుష్ప్రచారం షురూ చేశారు. ఫస్ట్‌ లుక్‌కి సంబంధించి విడుదల చేసిన ప్రీ లుక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ కలర్‌ ‘ఎల్లో’ వుండడంతో.. దాన్ని తెలుగుదేశం పార్టీకి అన్వయించేస్తున్నారు.

అవునా.? అదే నిజమైతే, సాక్షి మీడియాది ఏ రంగు.? సాక్షి పత్రిక చూడగానే ముందు ఎల్లో కలర్‌ కన్పిస్తుంది అందరికీ. పవన్‌ని విమర్శించడానికి వేరే కారణాలేవీ దొరక్క.. ఇదిగో ఈ ‘రంగు’ పట్టుకుని రచ్చ చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, సినిమాలో లిప్‌ లాక్‌ సీన్స్‌ వుంటాయనీ, హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌ వుంటుందనీ.. ఏవేవో చెత్త రాతలు సోషల్‌ మీడియాలో కన్పిస్తున్నాయి.

మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ ఈ సినిమాకి ఇబ్బందులు తప్పవనే చర్చ కూడా తెరపైకొస్తోంది. ఇది ‘పింక్‌’ సినిమాకి రీమేక్‌. నిజానికి, ఇందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పెద్దగా ఏమీ వుండవు. మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా ఇది. ఇప్పుడే ఇంత భయమా.? సినిమా విడుదలై పవన్‌ గనుక హిట్టు కొడితే, ‘హేటర్స్‌’ పరిస్థితి ఏంటట.?

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని...

జగన్ ఏడాది పాలన: సంక్షేమం సరే.. అభివృద్ధి మాటేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది మే 30న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో...

‘కరోనా’ అయితే ఏంటి .? దుబాయిలో దోచేస్తున్నాడు.!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకుల నుంచి...

రివ్యూ : రక్తాంచల్ (వెబ్ సిరీస్)

నటీనటులు : నికితిన్ ధీర్, క్రాంతి ప్రకాష్ ఝా, సౌందర్య శర్మ, రోంజిని చక్రవర్తి, చిత్తరంజన్ త్రిపాఠి తదితరులు. నిర్మాణం : ఎంఎక్స్ ప్లేయర్ దర్శకత్వం: రితమ్ శ్రీవాస్తవ్ నిడివి : 86 నిముషాలు విడుదల తేది :...

ఆ కుర్రాడు పాములా నెలకు ఒకసారి కుబుసాన్ని వదులుతూ ఉంటాడు

పాములు తమ చర్మ అమరిక అనుసారంగా కుబుసంను వదులుతూ ఉంటాయి. పాములు కుబుసం వదలడం చాలా కామన్‌ విషయం. కాని ఒక మనిషి పాము మాదిరిగా కుబుసం వదలడం ఎప్పుడైనా చూశారా. మనిషి...