Switch to English

పైశాచికానందం.. సాయిధరమ్ తేజ్‌కి అలా జరిగి వుంటే.!

సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వార్త అటు సినీ పరిశ్రమనీ, ఇటు ప్రేక్షకాభిమాల్నీ షాక్‌కి గురిచేసింది. ‘ఖరీదైన బైక్‌ల మీద అత్యంత వేగంగా వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమేంటి.?’ అన్న ప్రశ్నే అందరి మదిలోనూ ముందుగా మెదిలింది. కారణం, చాలామంది ప్రముఖుల వారసులు, ఇలాగే రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయి, కన్నవారికి కడుపు కోత మిగిల్చారు.

ఇక, సాయిధరమ్ తేజ్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది. ఇంకోపక్క, రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై మీడియాలో చిత్ర విచిత్రమైన విశ్లేషణలు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చేసింది. ఆ సమయంలో కాస్త వేగంగానే బైక్ మీద సాయి ధరమ్ తేజ్ వెళుతూ ప్రమాదానికి గురైనట్లు అందులో కనిపిస్తోంది. అది ఎంత వేగం.? అన్నదానిపై అధికారిక ప్రకటన పోలీసుల నుంచి రావాల్సి వుంది.

కానీ, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న బైక్.. అని కొన్ని న్యూస్ ఛానళ్ళు ధృవీకరించేశాయి. మరోపక్క, ‘ఇలా జరిగి వుంటే, ప్రాణాలు దక్కడం చాలా కష్టం..’ అంటూ విశ్లేషణలు షురూ అయ్యాయి. ‘సాయిధరమ్ తేజ్ ప్రాణం గట్టిదే..’ అంటూ వెటకారాలూ షురూ అయ్యాయి. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ‘రెస్ట్ ఇన్ పీస్’ అని ముందుగానే పెట్టేశారు. బాధిత కుటుంబానికి ఇవన్నీ ఈ సమయంలో ఎంత ఆవేదన కలిగిస్తాయి.? అన్న కనీస ఇంగితం వుంటే, అసలిలాంటి కామెంట్లే రావు. కొందరిలో పెరిగిపోతున్న పైశాచిక ఆలోచనలకు నిదర్శనమిది.

మీడియాలోనూ ఆ పైశాచికానందం చాలా ఎక్కువగానే పెరిగిపోయింది ఇటీవలి కాలంలో. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి.. సెలబ్రిటీనే అయి వుండొచ్చు, కానీ, ఆయన కుటుంబాన్ని ఈ సమయంలో ఇంతలా వేధించడమా.? ప్రధానంగా యెల్లో మీడియా, బ్లూ మీడియా.. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి కావడంపై అత్యుత్సాహపూరిత కథనాల్ని, కల్పనలు జోడించి మరీ ప్రసారం చేసేశాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా మెగాభిమానులే కాదు, సగటు సినీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

నోరు జారి, ఆపై క్షమాపణ చెప్పి.. వీర్రాజూ.. ఎందుకీ నారాజు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు బీజేపీ ఏం చేస్తోంది.? ఏం ఆశిస్తోంది.? తెలంగాణ బీజేపీని చూసి కూడా ఏపీ బీజేపీ నేతలు పదునైన రాజకీయ వ్యూహాల్ని రచించలేకపోతున్నారు. దూకుడు విషయంలో తెలంగాణ బీజేపీ, ఏపీ...

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

ఎక్కువ చదివినవి

టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టు..!

సీఎం జగన్, మంత్రి కొడాలి నాని, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు...

దేశంలో కోవిడ్ కేసుల్లో తగ్గుదల.. మరణాల్లో పెరుగుదల

కొన్నిరోజులుగా దేశంలో మూడు లక్షలకు దిగువనే నమోదవుతున్న కరోనా కేసులతో పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టే ఉంది. గడచిన 24 గంటల్లో 17లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,35,532 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి....

మరోసారి సమంత అదే తరహాలో…

నాగ చైతన్య నుండి విడిపోయాక సమంత సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళ్తోందన్న వార్త ఒకటి ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్లుగానే తన కెరీర్ లో మొదటిసారి ఐటమ్ గర్ల్ గా నటించింది....

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని వెర్సటైల్ దర్శకుడు సంజయ్...

సక్సెస్ కోసం పేరు మార్చుకున్న యువ హీరో

ఇండస్ట్రీలో పేర్లు మార్చుకోవడం సర్వసాధారణం. అప్పటికే ఇండస్ట్రీలో అదే పేరు మీద వేరొకరు చలామణిలో ఉండటం, లేదా సినిమాలకు సూట్ అవ్వడం కోసం ఆకర్షణీయమైన పేరుని పెట్టుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం....