Switch to English

జర్నలిజం అంటే కల్పితమా.? జర్నలిస్టుకి హరీష్ శంకర్ ప్రశ్నాస్త్రం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సినిమా అంటేనే కల్పితం. కల్పిత పాత్రలతో.. అంటూ సినిమాని తెరకెక్కిస్తారు. ఈ విషయం కూడా తెలియని ఓ జర్నలిస్టు ఏకంగా, సెన్సార్ బోర్డు మెంబర్ అయిపోయారు. ఇదీ మన తెలుగు మీడియా ఖర్మ. సి

నీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవడంపై తెలుగు మీడియాలో ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న బైక్ ఏకంగా గంటకి 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా సదరు మీడియా ఓ కథనాన్ని తెరపైకి తెచ్చింది. నాన్ స్టాప్ కవరేజ్.. అంటూ పెద్ద రచ్చే చేస్తూ వచ్చింది సదరు మీడియా.

ఈ మొత్తం వ్యవహారంపై సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఒకింత తీవ్రంగానే స్పందించాల్సి వచ్చింది. ‘హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు.. హాస్పిటల్ బెడ్ మీద వుండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్. నీ యాక్సిడెంట్ వంకతో తప్పుడు వార్తలు అమ్ముకుని బతికేస్తున్న అందరూ బాగుండాలి. వాళ్ళకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నాను..’ అని హరీష్ శంకర్ ట్వీటేశారు.

దాంతో, ఓ జర్నలిస్టు ‘భుజాలు తడిమేసుకున్నాడు’. ‘మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. తప్పుడు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ, తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు. అతి వేగంతో వెళ్ళి మీరు ప్రమాదానికి గురవడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు’ అని సదరు జర్నలిస్టు ట్వీటేశాడు.

‘నేను తప్పుడు వార్తలు అని క్లియర్గా మెన్షన్ చేశాను కదా. మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు.. అంటే ఒప్పుకున్నట్లేనా.? థాంక్యూ ఫర్ యువర్ క్లారిటీ.. ఇక పోతే, మా సినిమాల్లో హింస అన్నారు. మాకు సెన్సార్ వుంది. మేం వాళ్ళకు ఆన్సరబుల్. మీకేముంది.. మీరు దేనికి ఆన్సరబుల్ కాస్త చెబుతారా? నేను మీ వ్యవస్థని తప్పు పట్టలేదు. వ్యవస్థని తప్పుదోవ పట్టించేవాళ్ళ గురించి చెబుతున్నాను..’ అని హరీష్ శంకర్, సదరు జర్నలిస్టుని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

దానికి అట్నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, ‘వ్యక్తిగా సమాజానికి జవాబుదారున్ని, జర్నలిస్టుగా ప్రశ్నించే గొంతుని. ఇక సెన్సార్ అంటారా.. అది ఎలా చేస్తారో మెంబర్‌గా నాకు తెలుసు..’ అంటూ సెన్సార్ బోర్డు మెంబర్‌గా తన పేరున్న ఓ సెన్సార్ సర్టిఫికెట్‌ని జత చేశాడు ఆ జర్నలిస్ట్.

హరీష్ శంకర్ ఫైనల్ టచ్ బీభత్సమైన రేంజ్‌లో ఇ్చేశాడు. ‘మరి సెన్సార్ బోర్డు మెంబర్ అంటున్నారు కదా.. ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం.. నిజం కాదు అని మేం వేస్తాం. మీరూ న్యూస్ ముందు ఇదంతా నిజం కాదు మా ఛానల్ కల్పితం అని వేయండి మరి.. జనాలకి ఒక క్లారిటీ వుంటుంది. లేదంటే, వార్తలతో సినిమాల్ని పోల్చడం మానెయ్యండి..’ అని ట్వీటేశారు హరీష్ శంకర్.

ఈ స్థాయికి జర్నలిజం దిగజారిపోయిందని ఓ జర్నలిస్ట్ ఒప్పుకున్నట్లయ్యింది. హరీష్ శంకర్ అన్నాడని కాదుగానీ, నిజంగానే జర్నలిజం అంటే కల్పితం అయిపోయింది.. అదీ మెరుగైన సమాజం కోసమంటూ బురద జర్నలిజం చేసే ఓ ఛానల్ మరికొన్ని ఛానళ్ళ పుణ్యమే.

4 COMMENTS

  1. దొంతు రమేష్ అనే పెయిడ్ మేధావి రమేష్ లాంటోళ్ళు మీడియా ముసుగులో సినిమా వాళ్ళపైన ఎంత విషం చిమ్మినా సినిమా వాళ్ళు మీడియా కి సమాధానం చెప్పడానికి భయపడుతారు అనే భ్రమల్లో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. వీళ్ళ మీడియా వ్యాపారం కోసం దారుణ హత్యలని, కిరాతక మానభంగాలని లైవ్ ప్రసారాలు చెయ్యడం, డిబేట్లు ముసుగు లో బండబూతులతో అనాగరికులు సైతం సిగ్గుపడేలా ఉన్మాద ప్రసారాలు చెయ్యడం, ఎవరైనా ప్రశ్నిస్తే మీడియా, జర్నలిజం అంటూ బ్లాక్ మెయిల్ చెయ్యడం. నేడు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్మాదం తో మీడియా ముసుగులో వ్యాపారం చేస్తున్న మెజారిటీ మీడియా సంస్తల పైన కఠిన చర్యలు తీసుకోవాలి, తెలుగు ప్రజల పరువు ప్రతిష్టలు కాపాడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నన్ను ఇంతటివాడ్ని...