దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తుంటారు. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఒక ఘటనపై హరీష్ శంకర్ స్పందించడంతో చిన్నారి రక్షించబడింది.
మెదక్ లో మున్సిపాలిటీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తోన్న నాగరాజు తన రెండో భార్య ముందు తన మూడేళ్ళ పాపను చితకబాదిన సంఘటన ఎవరో సీక్రెట్ గా వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. హరీష్ శంకర్ ఈ వీడియో చూసి స్పందించి పోలీసులను ట్విట్టర్ లో ట్యాగ్ చేయడంతో వాళ్ళు స్పందించారు.
మెదక్ పోలీసులతో పాటు అధికార యంత్రాంగం కూడా స్పందించి వెంటనే ఆ చిన్నారిని సఖి కేంద్రానికి పంపడం జరిగింది. అలాగే చిన్నారిని హింసించిన వ్యక్తికి తగిన శిక్ష పడేలా చేస్తామని అదనపు కలెక్టర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. త్వరగా ఈ బాలిక విషయంలో న్యాయం జరగడంతో అందరూ హర్షిస్తున్నారు.
928243 538570Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im certainly enjoying your weblog and appear forward to new updates. 801552
517886 398833I dont agree with this specific post. Nevertheless, I did researched in Google and Ive located out which you are correct and I had been thinking inside the incorrect way. Continue producing quality material comparable to this. 511866