చాలా కాలంగా పెండింగ్ లో ఉంటున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు మళ్లీ వేగం పుంజుకుంటోంది. ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్ని అడ్డంకులు దాటుకుని షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ డైరెక్షన్ లో రీసెంట్ గానే భారీ యాక్షన్ సీన్లను రూపొందించారు. పవన్ కల్యాణ్ తో పాటు దాదాపు 400-500 మంది ఈ భారీ యుద్ధ సన్నివేశాల్లో పాల్గొన్నారు.
ఈ యుద్ధం సీన్లు సినిమాకు హైలెట్ గా ఉంటాయి. ఈ సీన్లు బాగా రావడంతో మూవీ టీమ్ సంతోషంగా ఉందంట. ఇక ఈ క్రమంలోనే మూవీ గురించి మరో అప్ డేట్ ఇచ్చారు నిర్మాతలు. మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలిపారు. ఈ వీక్ చివర్లో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట. ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి అవుతుందని తెలుపుతున్నారు. ఇందులో కూడా పవన్ తో పాటు మరో 200 మంది షూటింగ్ లో పాల్గొంటారని చెబుతున్నారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ అన్నీ తానై చూసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ అభిమానులు ఊహించిన రీతిలోనే సినిమా ఉంటుందంట. పవన్ తో పాటు చాలా మంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. ఇక నుంచి వరుసగా అప్ డేట్లు ఇస్తామని కూడా మూవీ టీమ్ ప్రకటించింది.