పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు హరి హర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్ పవర్ గ్లాన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది ఆ వీడియోలో ఉంది. పవన్ కళ్యాణ్ మల్ల యుద్ద సన్నివేశాలను అద్భుతంగా దర్శకుడు చూపించాడు. పవన్ కళ్యాణ్ ను ఎప్పుడెప్పుడు హరి హర వీరమల్లు సినిమాలో థియేటర్ లో చూస్తామా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
థియేటర్ లో హరి హర వీరమల్లు గా పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో సందడి చేయడం కన్ఫర్మ్ అని పవర్ గ్లాన్స్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. గత బర్త్ డే సందర్భంగా విడుదల అయిన వీడియోతో పోల్చితే ఇది అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకోని తొడకొట్టాడో.. తెలుగోడు! అంటూ పవన్ కళ్యాణ్ ను చూపించిన తీరు ప్రతి ఒక్కరిని కూడా మెప్పిస్తోంది.
అద్భుతమైన విజువల్స్ తో పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించబోతున్నాడో చెప్పకనే చెప్పాడు. ఇక ఈ పవర్ గ్లాన్స్ కి కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి హరి హర వీరమల్లు సినిమా యొక్క అంచనాలు మరింతగా పెంచే విధంగా ఈ వీడియో ఉంది.
768293 392149I just added this webpage to my feed reader, fantastic stuff. Cannot get enough! 568122