పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూపించే ఎలివేషన్ సీన్లు ఎంత స్పెషల్‌గా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ ఆయన రాజకీయ ప్రస్థానమే అసలైన ఎలివేషన్ అని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.
రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయినా, ఆయన వెనక్కి తగ్గలేదు. అదే ధైర్యం, అదే పట్టుదలతో ముందుకు సాగారు.
“రెండు చోట్లా ఓడిపోయినా కూడా 151 సీట్లు ఉన్న ప్రభుత్వాన్ని కాళ్ళ కింద వేసి తొక్కేసావ్ చూడు.. అదీ మాకు కిక్ ఇచ్చే మీ ఎలివేషన్ అన్నా” అంటూ ఫ్యాన్స్ సంబర పడుతున్నారు.
KGF, Pushpa సినిమాలు ఎంత ఎలివేషన్ చూపించాయో, పవన్ కళ్యాణ్ జీవితం అంతకన్నా పెద్ద ఎలివేషన్ చూపిస్తోంది. ఓటమి వచ్చినా ఆయనకు అది పాఠమే తప్ప ఆటంకం కాలేదు. గెలుపు సాధించే వరకు కష్టపడటం ఆయన స్వభావం.
అభిమానులు సోషల్ మీడియాలో #HBDPawanKalyan హ్యాష్‌ట్యాగ్‌తో శుభాకాంక్షలు చెబుతూ, “పవన్ కళ్యాణ్ మీ ఎలివేషనే వేరప్ప” అంటూ ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతటి ఎలివేషన్ సాధించడం పవన్ కళ్యాణ్‌కే సాధ్యం.
నిజాయితీ, కష్టం, ధైర్యం ఆయన ఎలివేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు. అందుకే అభిమానులు ఆయనను కేవలం పవర్ స్టార్‌గానే కాకుండా పవర్ లీడర్‌గా కూడా గర్వంగా పిలుస్తున్నారు.
ఈ సందర్భంగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి టీమ్ తెలుగు బులెటిన్ కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.
