Switch to English

‘హ్యాపీ బర్త్ డే’ లో కొత్త ప్రపంచంలో సరికొత్త కామెడీ ఉంటుంది – రితేష్ రానా

మత్తు వదలరా చిత్రంతో క్రేజీ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు రితేష్ రానా నుండి వస్తోన్న సెకండ్ మూవీ హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా జులై 8న విడుదలవుతోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. హ్యాపీ బర్త్ డే విడుదల సందర్భంగా రితేష్ రానా మీడియాతో ముచ్చటించారు.

మత్తు వదలరా టీమ్ తోనే హ్యాపీ బర్త్ డే చేసారు?

వాళ్లతో నాకు సింక్ కుదిరింది. మా టీమ్ అంతా పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాం. ఒకరిని ఒకరం బాగా అర్ధం చేసుకున్నాం.

ట్రైలర్ లో సర్రియల్ కామెడీ అన్నారు?

సర్రియల్ కామెడీ అనే జోనర్ గా ఉంది. అయితే తెలుగులో ఈ జోనర్ లో సినిమా రాలేదు. అలా అని ప్రేక్షకులకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సినిమా ప్రమోషన్స్ లో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పాం.

ఈ సినిమాకు ఏదైనా ప్రేరణ?

ముందే చెప్పినట్లు ఇలాంటి జోనర్ సినిమా రాలేదు. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ గా ఉంటుంది. క్వేంటిన్ టోరెంటినో ‘పల్ప్ ఫిక్షన్’ తరహాలో స్క్రీన్ ప్లే ఉంటుంది.

ట్రైలర్ చూసిన వారు అర్ధం కాలేదని అంటున్నారు?

కథ అర్ధం కాకూడదన్న ఉద్దేశంతోనే ఇలా కట్ చేసాం. ఈ కథ జరిగే ప్రపంచాన్ని పరిచయం చేసాం. పాత్రల తీరు తెన్నులు చూపించాం. కథ సినిమా చూస్తేనే అర్ధమవుతుంది.

మత్తు వదలరా లో చేసిన సత్య, వెన్నెల కిషోర్, అగస్త్యలే ఇందులో కూడా నటించారు?

ఏదైనా సింక్ ఉంటె ఔట్పుట్ బాగుంటుంది అని నమ్ముతాను నేను. అందుకే వాళ్లతోనే మళ్ళీ పనిచేసాను

లావణ్య త్రిపాఠినే తీసుకోవడం గురించి?

ఈ పాత్ర ఆమెకు కొత్తగా ఉంటుంది అనిపించింది. ఈ కథకు ఆమె పాత్ర చాలా ముఖ్యం. కథను ఆమె పాత్ర లీడ్ చేస్తుంది.

ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పండి

చాలా ప్రాధాన్యత ఉంటుంది సంగీతానికి. సినిమా చాలా క్రేజీగా తీసాం. మ్యూజిక్ డబల్ క్రేజీగా ఉంటుంది.

ప్రమోషన్స్ లో ప్యాన్ తెలుగు అన్నారు? సెటైర్ ఆ?

అలా ఏం లేదండీ. సరదాగా నవ్వుకోవడానికి ఉంటుందని అలా వాడాం. ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదలవుతోంది అన్న ఉద్దేశం.

హ్యాపీ బర్త్ డే అన్న టైటిల్ గురించి?

ఇందులో లావణ్య త్రిపాఠి హ్యాపీ అనే పాత్రలో కనిపిస్తుంది. ఆమె బర్త్ డే రోజున కొన్ని కీలకమైన పరిణామాలు జరుగుతాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం.

మరోసారి మైత్రి తోనే చేయడానికి కారణం?

మైత్రి వాళ్లతో సౌకర్యం ఉంటుంది. నా స్టైల్ వాళ్లకు తెలుసు. సినిమాపై ప్యాషన్ ఉన్న నిర్మాతలు

నెక్స్ట్ సినిమాల సంగతేంటి?

రెండు కథలను లాక్ చేశాను. వాటి గురించి త్వరలోనే చెబుతాను. అంటూ ఇంటర్వ్యూ ముగించాడు రితేష్ రానా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

“తీస్ మార్ ఖాన్” లో ప్రతీ 15 నిమిషాలకు ఒక ట్విస్ట్...

ఆది సాయి కుమార్ లీడ్ రోల్ లో నటిస్తోన్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ సినిమాలో ఆది స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా...

ఈ చిత్రం హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు – నిఖిల్

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. కార్తికేయ సీక్వెల్ గా...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

రాజకీయం

పదవి మనల్ని వెతుక్కుంటూ రావాలి.. మనం ఆరాట పడకూడదు: పవన్ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పెద్ద ఎత్తున తీసుకొచ్చి.. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

స్వేచ్ఛ.! స్వాతంత్ర్యం.! ప్రజలకా.? నేరస్తులకా.?

ఆజాదీ కా అమృత మహోత్సవ్.! ఈ నినాదంతో డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావని సంబరాలు చేసుకుంటోంది. చిన్నా పెద్దా, ఆ కులం.. ఈ మతం.. అన్న తేడాల్లేవ్.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ఉప్పొంగే...

‘ఘన’కార్యం చేశారు కదా.! ఘన స్వాగతం పలకాల్సిందే.!

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కోసం సొంత నియోజకవర్గంలో అభిమానులు (?!) భారీ ఏర్పాట్లు చేశారట. వందలాది కార్లు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నాయట. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు...

57 శాతం ఓట్లకి 18 లోక్ సభ సీట్లు మాత్రమేనా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ...

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎక్కువ చదివినవి

కాళరాత్రిలో విమాన ప్రమాదం.. సాయం చేసిన గ్రామస్థులకు కృతజ్ఞతగా ఆసుపత్రి

మానవత్వంతో వారు చేసిన సాయానికి కృతజ్ఞత చూపించారు విమాన ప్రమాద బాధితులు. 2020 ఆగష్టు 7న 190 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వచ్చిన విమానం కేరళలోని కరిపూర్ గ్రామానికి సమీపంలోని కోజికోడ్...

‘తల్లిని మించిన యోధురాలు లేదు..’ విష సర్పం నుంచి బాలుడిని కాపాడుకున్న తల్లి

‘తల్లిని మించిన యోధురాలు భూమి మీద లేదు’ అని కేజీఎఫ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దీనిని నిజం చేస్తూ కన్నబిడ్డపై తల్లి ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు కర్ణాటకలోని మాండ్యలో...

“తీస్ మార్ ఖాన్” లో ప్రతీ 15 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది – దర్శకుడు కళ్యాణ్ జి గోగణ

ఆది సాయి కుమార్ లీడ్ రోల్ లో నటిస్తోన్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ సినిమాలో ఆది స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు....

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన ఫ్యాన్స్

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్...

బర్త్‌డే స్పెషల్‌ : నీ దూకుడుకు సరిలేరు ఎవ్వరు

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంను పునికి పుచ్చుకున్న మహేష్‌ బాబు చిన్నప్పటి నుండే నటుడిగా వెండి తెర అరంగేట్రం చేశాడు. చిన్న వయసులోనే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా పేరును దక్కించుకున్నాడు. స్కూల్...