టాలీవుడ్‌లో ‘అనుమానస్పదం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ఆ తరువాత పలు సినిమాలు చేసినా అమ్మడికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాలో ఓ పాటలో అమ్మడి కేమియోకు అదిరిపోయే గుర్తింపు వచ్చింది. ఇక ఆ తరువాత వరుసగా వ్యాంప్ తరహా పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ. స్టార్ హీరోల సినిమాల్లోనూ పలు ఐటెం సాంగ్స్ చేస్తూ రెచ్చిపోయింది ఈ బ్యూటీ.
అయితే ఇటీవల తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆమె చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ తరువాత ఆమె తన వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు పేర్కొనడంతో, హంసా నందిని త్వరగా ఈ క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుకున్నారు. అయితే తాజాగా తాను క్యాన్సర్‌ను జయించానని తీపి కబురును చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఇక తాను తిరిగి సినిమా షూటింగ్స్‌కు హాజరవుతున్నానని.. ఇది తనకు పునర్జన్మలా ఉందని ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది హంసా. ఏదేమైనా క్యాన్సర్ లాంటి మహమ్మారిని జయించిన హంసా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిందని పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.