Switch to English

వైఎస్‌ జగన్‌ దోస్త్‌ జీవీఎల్‌ నోటికి తాళం పడేనా.?

‘రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం.. కేంద్రానికి సంబంధం లేని విషయం..’ అంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు. అసలు రాజధాని అంశం రాజ్యాంగంలోనే లేదంటారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ రాజదాని అంటే ఇంత వెటకారం అయిపోయింది చాలామందికి.!

అన్నట్టు, కేంద్రం కూడా రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఇటీవలే పార్లమెంటు సాక్షిగా తేల్చేసింది. కానీ, హైకోర్టు మాత్రం, రాజధాని వ్యవహారంపై కేంద్రం ఎందుకు మౌనంగా వుంటోంది.? అని ప్రశ్నించడం గమనార్హం. ఈ ప్రశ్నతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి తెరవెనుకాల సహాయ సహకారాలు అందిస్తోన్న జీవీఎల్‌ నరసింహారావుకి నోటికి తాళం పడిపోయినట్లేనేమో.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి సంబంధించి విభజన చట్టంలో పూర్తి స్పష్టత వుంది. కొత్త రాజధాని కోసం కేంద్రం కమిటీ వేస్తుందనీ, ఆ కమిటీ సూచనల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చన్నది ఆ స్పష్టత సారాంశం. శివరామకృష్ణన్‌ కమిటీ ఏర్పాటయ్యింది.. అప్పట్లో చంద్రబాబు సర్కార్‌, అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది కూడా.

మరోపక్క, 2024 వరకూ హైద్రాబాద్‌, తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌కీ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుందని విభజన చట్టం చెబుతోంది. అంటే, కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పట్ల పూర్తి బాధ్యత వుందనే కదా అర్థం. సో, ఇప్పుడిక కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు. రాష్ట్రంలో మూడు రాజధానుల్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఒకటి అమరావతి, ఇంకోటి కర్నూలు.. మరొకటి విశాఖపట్నం. అసలు రాజధాని అనే ప్రస్తావన రాజ్యాంగంలో లేదని ముఖ్యమంత్రి వెఎస్‌ జగన్‌ అసెంబ్లీలో చెప్పాక, మూడు రాజధానుల చర్చ ఏంటి.? అన్నదానికి తొలుత సమాధానం వెతకాల్సిన బాధ్యత కేంద్రం మీద వుంది.

అధికారంలో వున్నవారు అన్నిటినీ తమకు అనుకూలంగా అన్వయించేసుకోవడం కొత్తేమీ కాదు. కానీ, చట్టాలు, నిబంధనలు.. వంటివాటిపై ప్రజలకు ఖచ్చితమైన వాస్తవాలు తెలిసి తీరాలి. అది న్యాయస్థానాల జోక్యంతో జరుగుతుందని ఆశిద్దాం.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది....

వలస కూలీల కోసం ఏకంగా విమానం బుక్‌ చేసిన రియల్‌ హీరో

కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలో మీటర్ల దూరంను వలస కార్మికులు కేవలం కాలినడకన చేరుకున్న విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ కారణంగా పనులు లేక పోవడంతో చాలా మంది తమ ప్రాంతాలకు...

త్రివిక్రమ్ – వెంకీ – నాని.. మళ్ళీ ఫేకే!

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో చిత్రంతో తిరిగి టాప్ ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిటయ్యాడు మాటల మాంత్రికుడు. ఎన్టీఆర్ తో చేసేది...

తెగేలాకా లాగితే తేడాలొస్తాయ్‌: నిమ్మగడ్డ ఉదంతంపై ఐవైఆర్‌.!

మాజీ చీఫ్‌ సెక్రెటరీ ఐవైఆర్‌ కృష్ణారావు, సోషల్‌ మీడియా వేదికగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఉదంతానికి సంబంధించి ఓ పత్రికలో...

షాకింగ్: మిడతల బిర్యానీ వారికి ఫేవరేట్ డిష్, ఎక్కడో తెలుసా??

కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం మిడతల దండు. సౌత్ ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయని భావిస్తున్న మిడతలు దేశంలోని రైతులను కలవర...