రాజధాని అమరావతి పరిధిలో ఓ రోడ్డుని కొందరు వ్యక్తులు అడ్డగోలుగా తవ్వేశారు. ఏకంగా జేసీబీలు తీసుకొచ్చి రోడ్డుని తవ్వేసి, మట్టిని, కంకర రాళ్ళను ఎత్తుకెళ్ళారు. ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగింది. రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకే అధికార పార్టీ కుట్రలకు తెరలేపిందంటూ టీడీపీ సహా వివిధ రాజకీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి అధికార పార్టీ మీద.
ఇంతకీ, అసలేం జరిగిందక్కడ.? ఆ తవ్వేయబడిన రోడ్డుకి కొంత దూరంలోనే వున్న ఓ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే ఆ మట్టి, రాళ్ళను తలరించారట. ఎందుకో తెలుసా.? తమ గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో, రహదారిని బాగు చేసుకునేందుకట. ఈ విషయాన్ని స్వయంగా గుంటూరు ఖాకీలు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ‘ఫ్యాక్ట్’ (నిజం) పేరుతో ఓ వీడియో రూపంలో విడుదల చేశారు.
అందులో గ్రామస్తులు, తాము సదరు రోడ్డుని బాగు చేసుకునేందుకు, ఇంకో రోడ్డుని తవ్వేసిన వైనం గురించి వెల్లడించారు. ఇదేదో పక్కా డైరెక్షన్తో చెప్పించిన మాటలు, తీయించిన వీడియోలా వుంది తప్ప, ఇందులో వాస్తవికత కనిపించడంలేదన్నది వేరే విషయం. అయినా, తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోతే, ఇంకో రోడ్డుని తవ్వేయొచ్చా.? ఇదెక్కడి వింత.? గుంటూరు ఖాకీలు వేసిన ట్వీటు, ఇచ్చిన వివరణపై సోషల్ మీడియాలో సెటైర్లు అత్యంత దారుణంగా పడుతున్నాయి.
‘సార్.. నా భార్య బాగోకపోతే, పక్కింటోడి భార్యని లేపుకొచ్చేయొచ్చా.?’ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘మా ఇంటి మీద పెంకులు పగిలిపోయాయి.. ముఖ్యమంత్రిగారి ఇంటి నుంచి వాటిని తెచ్చుకోవచ్చా..’, ‘రాష్ట్రంలో చాలా రోడ్లు పాడైపోయాయి.. బాగున్న రోడ్లను తవ్వేసి, తమక్కావాల్సిన చోట్ల రోడ్లను బాగు చేసుకోవచ్చా..’ అంటూ నెటిజన్లు గుంటూరు ఖాకీలనుద్దేశించి తమ అనుమానాల్ని ప్రశ్నాస్త్రాలుగా సంధిస్తున్నారు. నిజంగానే గుంటూరు ఖాకీలే ఆ వివరణ వీడియో పోస్ట్ చేశారా.? లేదంటే, ఆ అధికారిక హ్యాండిల్ ఏమైనా హ్యాకింగ్ అయిపోయిందా.? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
We request everyone to verify #Facts before posting on #socialmedia..the above road material was dug up and used by the villagers of uddandarayapalem to repair their village road damaged by rains.. pic.twitter.com/wVCwROMVqp
— GUNTUR RURAL DISTRICT POLICE (@GntRuralPolice) July 26, 2021
751148 955388But wanna remark which you have a quite decent internet site , I adore the design it genuinely stands out. 611018
368838 856284I was examining some of your content on this internet internet site and I believe this site is rattling instructive! Keep putting up. 887081