టాలీవుడ్ లో కొన్ని బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ఉంటాయి. వారు కలిసి పని చేస్తున్నారంటే చాలు ఆటోమేటిక్ గా ఆ మూవీకి హైప్ వచ్చేస్తుంది. అలాంటి కాంబినేషన్ ఇప్పుడు ఒకటి రిపీట్ అవుతోంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఒక్కడు మూవీని ఎవరూ మర్చిపోరు. ఆ మూవీ భూమిక, మహేశ్ కెరీర్ లను మలుపు తిప్పింది. అయితే ఇప్పుడు భూమిక-గుణశేఖర్ మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు. గుణశేఖర్ ప్రస్తుతం ‘యుఫోరియా’ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే కంప్లీట్ అయింది.
రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా బాగున్నాయి. ఇక తాజాగా సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ లో భూమిక జాయిన్ అయింది. తాజాగా సెట్స్ లో ఆమె పాల్గొంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భూమిక కోసం గుణశేఖర్ ఓ పవర్ ఫుల్ పాత్రను రెడీ చేసినట్టు సమాచారం. సమాజంలో జరుగుతున్న దురాగతాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో సారా అర్జున్, నాజర్, రోహిత్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక భూమిక రాకతో మూవీకి మరింత హైప్ రావడం గ్యారెంటీ అంటున్నారు మేకర్స్.
చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు. దాంతో మూవీలో భూమిక పాత్ర ఎలా ఉంటుందో అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.