Switch to English

గ్రౌండ్‌ రిపోర్ట్‌: వైఎస్‌ జగన్‌ పాలన.. ఇలాగైతే కష్టమేనట.!

రోజులు గడుస్తున్నాయ్‌.. నెలలు గడిచిపోతున్నాయ్‌.. అయినా, ఇంకా అభివృద్ధి దిశగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం సరైన అడుగు వేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో ఒకింత అసహనం స్పష్టంగా కన్పిస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనను తప్పు పట్టడానికి వీల్లేదు. ఎడా పెడా కొత్త కొత్త పథకాలు పుట్టుకొచ్చేస్తున్నాయ్‌.! విపక్షాల ఆందోళనలకు తలొగ్గుతున్నారో, లేదంటే.. సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేకత పెరిగితే, అది ప్రభుత్వానికి ముప్పు తెస్తుందని ఆందోళన చెందుతున్నారోగానీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. ఏ చిన్న సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే పరిష్కరించేస్తోంది..

అది సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రమే. పెన్షన్లు తదితర వ్యవహారాల్లో ఈ స్పీడు కన్పిస్తోంది. కానీ, కీలకమైన విషయాల పట్ల వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అస్సలేమాత్రం వేగం చూపలేకపోతోంది. అందులో ముఖ్యమైనది రాజధాని. గడచిన తొమ్మిది నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. నిజానికి, అమరావతిపై అనుమానాలు రేకెత్తించింది జగన్‌ ప్రభుత్వమే. సాక్షాత్తూ మంత్రులే రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఆ తర్వాత వ్యవహారం అందరికీ తెల్సిందే. మూడు రాజధానుల అంశం గత రెండు నెలలుగా నానా యాగీకి కారణమవుతోంది.

పోలవరం ప్రాజెక్టు సహా అనేక కీలక అంశాలపై రాష్ట్ర ప్రజానీకంలో చర్చ చాలా జోరుగా సాగుతోంది. ‘సంక్షేమ పథకాలు ఎవరు అధికారంలో వున్నా అందుతాయి.. కొత్త ప్రభుత్వాలు వస్తే, పెన్షన్లు పెరగడం సర్వ సాధారణమే. కానీ, కొత్త పేర్లు తెరపైకి తెస్తూ, జనాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు..’ అనే అభిప్రాయం రాష్ట్ర ప్రజానీకంలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటున్నా, అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నారు.

‘జగన్‌ తాను చెయ్యాలనుకున్నది చేస్తారు తప్ప.. దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే సహించలేరు.. అది పార్టీ నేతలు చెప్పినాసరే..’ అని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయ్‌.. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైఎస్‌ జగన్‌, పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నారు. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయనీ, పాలన పట్ల వ్యతిరేకత పెరుగుతోందనీ వైసీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

రానా, మిహీకల నిశ్చితార్ధం నేడే

రానా దగ్గుబాటికి ఇండస్ట్రీలో అల్లరి కుర్రాడిగా పేరుంది. ఇండస్ట్రీలో తన తోటి వయసు నటులతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రానాపై గతంలో కొన్ని లింకప్ రూమర్స్ వచ్చాయి కానీ వాటన్నిటినీ రానా తోసిపుచ్చాడు....

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

ఫ్లాష్ న్యూస్: యువకుడి ప్రాణాలు తీసిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మెదక్ జిల్లా నిజాం పేట మండలం రాంపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ...

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...