Switch to English

గ్రౌండ్‌ రిపోర్ట్‌: దేశంలో ‘పెను విపత్తు’గా మారుతున్న కరోనా!

అమెరికా లాంటి దేశాలతో పోల్చితే, భారతదేశంలో కరోనా ప్రభావం తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభిప్రాయపడింది. అయితే, అది గతం. లాక్‌డౌన్‌ ప్రకటించాక, దేశంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయని అంతా అంచనా వేశారు. నిన్న మొన్నటిదాకా అదే అభిప్రాయం దేశ ప్రజానీకంలో కూడా కాస్తో కూస్తో కన్పించింది. కానీ, క్రమక్రమంగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అనూహ్య స్థాయిలో పెరిగిపోతోంది.

నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు 4 వేల కరోనా పాజిటివ్‌ కేసులు దేశంలో కొత్తగా నమోదయ్యాయంటే, కరోనా వైరస్‌ తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి జోరు కొనసాగితే, దేశంలో ఈ రోజే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటేయొచ్చు. ప్రధానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.

నిన్న ముంబైలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కాగా, మొత్తం మహారాష్ట్రలో దాదాపు 1500కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. తమిళనాడులోనూ కరోనా వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. నిన్న తమిళనాడులో 500కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిన్న కరోనా పాజిటివ్‌ కేసులు సింగిల్‌ డిజిట్‌కి పరిమితం కావడం గమనార్హం.

అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో 67 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదు కాగా, ఈ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 500 దాటేయడం గమనార్హం.

మద్యం దుకాణాల్ని తెరవడంతో దేశంలో కరనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ముందు ముందు అనూహ్యంగా పెరుగుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 40 వేల నుంచి 50 వేలకు కరోనా కేసులు దేశంలో పెరగడం చాలా వేగంగా జరిగిన దరిమిలా, 50 వేల నుంచి లక్ష కేసులకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఎక్కువ చదివినవి

‘ఆర్ఆర్ఆర్’ టీంకి బిగ్ షాకిచ్చిన దిల్ రాజు.!

దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుషితం'. లాక్ డౌన్...

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం ఏంటో తెలుసా?

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ ఆయన్ను దేశ వ్యాప్తంగా ఆకాశానికి ఎత్తుతున్నారు....

భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి 20 మంది సజీవ సమాధి

అసోంలో తుఫాన్‌ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్థవ్యస్థం అయ్యింది. బరాక్‌ లోయ సమీపంలో భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. దాంతో ఆ కొండ చరియల...

జస్ట్‌ ఆస్కింగ్‌: ఆ 49 మందిలో ‘ఇల్లిటరేట్స్‌’ వున్నారా అద్దేపల్లి శ్రీధర్‌గారూ.!

ఒకప్పుడు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ఆ తర్వాత జనసేన తరఫున వకాల్తా పుచ్చుకుని, ప్రస్తుతం వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటోన్న అద్దేపల్లి శ్రీధర్‌.. ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో ‘ఇల్లిటరేట్స్‌’ అంటూ...

పిక్ ఆఫ్ ది డే: అన్నగారు – మెగాస్టార్ @ ఓ మధుర జ్ఞాపకం.!

నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి. ఈ సందర్భంగా తెలుగు వారందరూ ఆయనకి సోషల్ మీడియా ద్వారా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పెద్దగా అన్నీ తానై, అందరి...