పెళ్లి అంటే వారం, పది రోజులు సెలవు పెట్టాల్సిందే..? కనీసం రెండు, మూడు రోజులైనా సెలవు పెట్టి సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. కానీ.. పెళ్లి పీటల మీద కూర్చుని.. పురోహితులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూండగా అవేమీ పట్టనట్టు ఓ పెళ్లి కొడుకు ల్యాప్ టాప్ లో పని చేసుకోవడం విస్తుగొలుపుతోంది. ‘కోల్ కతా ఇన్ స్టాగ్రామర్స్’ ఇన్ స్టాలో పోస్ట్ అయిన ఈ పిక్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అయింది.
దీంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మరో లెవల్ కు తీసుకెళ్లావని కొందరు.. పెళ్లి రోజైనా సంతోషంగా ఉండనివ్వరా.. అని మరికొందరు.. ఉద్యోగం, లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకో అని ఇంకొందరు కామెంట్ చేశారు. పెళ్లి రోజున పని చేయమని ఏ సంస్థా చెప్పదు.. ఇది పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ అని మరికొందరు కొట్టిపారేశారు. మొత్తానికి ఈ పిక్ తో అటెన్షన్ క్రియేట్ చేశాడా ల్యాప్ టాప్ పెళ్లికొడుకు..!
https://www.instagram.com/p/ClYhby_tAwV/?utm_source=ig_web_copy_link
Hello my family member! I want to say that this article is awesome, great written and include approximately all vital infos. I’d like to look extra posts like this .