అసలు గ్రామ సచివాలయాలు ఎందుకు.? ఈ ప్రశ్న చాలామందిలో కలగడం సహజమే. గ్రామ పంచాయితీలున్నాయి.. సర్పంచి వ్యవస్థ వుంది. కొత్తగా గ్రామ సచివాలయాల వ్యవస్థతో ప్రజలకు ఒరిగేదేంటి.? అని ఆయా గ్రామాల్లో ప్రజలూ అనుకుంటున్నారు. కానీ, గ్రామ సచివాలయాల విషయంలో అధికార వైసీపీ చూపుతున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. గ్రామ సచివాలయాల్లో అన్ని సేవలూ అందుబాటులో వుంచాలని ప్రభుత్వం భావించడాన్ని తప్పు పట్టలేం. అదే పని, గ్రామ పంచాయితీల్లో చేస్తే సరిపోతుంది కదా.. అలా చేయగలిగితే, గ్రామ సచివాలయాలంటూ అదనపు హంగులు, ఖర్చు అవసరం వుండవు.
కానీ, తమ ప్రభుత్వం ఏదో కొత్తగా ప్రజల్ని ఉద్ధరించేస్తోందని చెప్పడం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న వాదనలున్నాయి. అందులో నిజం లేకపోలేదు కూడా. అన్న క్యాంటీన్లకు టీడీపీ ప్రభుత్వం పచ్చ రంగు పులిమింది గనుక, వైసీపీ.. గ్రామ సచివాలయాల పేరుతో వైసీపీ జెండా రంగుల్ని పులిమిన వైనం, ఈ క్రమంలో హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు తినడం తెలిసిన సంగతులే. ఇప్పుడసలు గ్రామ సచివాలయ వ్యవస్థ ఎందుకు.? గ్రామ పంచాయితీ వ్యవస్థ వుంది కదా.? అంటూ హైకోర్టు ప్రశ్నించడంతో అధికార పార్టీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
వీఆర్వోలకు అధికారాలు అప్పగించడం ద్వారా పంచాయితీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాలు లాగేసుకోవడమే కదా.? అన్న ప్రశ్న కూడా హైకోర్టు వ్యాఖ్యల్లో కనిపించింది. కొసమెరుపేంటంటే, వ్యవస్థను చక్కదిద్దేలా ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఏజీకి న్యాయమూర్తి సూచించడం. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది.? అన్నది వేరే చర్చ. కానీ, గ్రామ సచివాలయాలతో అదనపు ప్రయోజనమేంటి.? అన్న చర్చ అయితే జన బాహుళ్యంలో గట్టిగానే జరుగుతోంది.
గ్రామ సచివాలయాల కోసం ప్రభుత్వం చేస్తోన్న అదనపు ఖర్చు, తిరిగి ఆ జనం నుంచే ముక్కుపిండి వసూలు చేయాలి. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ ఇలాగే రాబట్టాలి.. వేరే దారి లేదు. అలాంటప్పుడు, పాలన ఖర్చులు తగ్గించుకుని.. ప్రజలకు మేలు చేయొచ్చు కదా.? అలా చేస్తే, పబ్లిసిటీ రాదన్నది అధికారంలో వున్నవారి భయం.
150527 773642An very interesting examine, I may not agree completely, but you do make some extremely legitimate factors. 46934
465093 991728hey there i stumbled upon your web site looking about the web. I wanted to tell you I enjoy the look of things around here. Maintain it up will bookmark for confident. 280775
55543 583036Greetings! Quick question thats completely off topic. Do you know how to make your internet site mobile friendly? My website looks weird when browsing from my apple iphone. Im trying to uncover a template or plugin that might be able to correct this issue. If you have any suggestions, please share. With thanks! 710247
532895 311437Wow, awesome blog structure! How long have you been running a weblog for? you created blogging appear effortless. The total look of your site is amazing, let alone the content material! 714534