Switch to English

కరోనా కంటే ‘కిరాతకంగా’ చంపేస్తోంది.!

దీన్ని నిర్లక్ష్యం అనాలా.? నిర్లక్ష్యమే అయితే అది పాలకులదేనా.? ఖచ్చితంగా పాలకులదే ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఒక్క పూట పని లేకపోతే పూటగడవుదు దేశంలో కోట్లాదిమంది పేదలకి. అలాంటిది దాదాపు రెండు నెలలపాటు ‘లాక్‌డౌన్‌’ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ‘ఛస్తే ఛస్తాం.. అదేదో సొంతూరిలో.. సొంత మనుషుల మధ్యనే చచ్చిపోవాలి..’ అంటూ వలస కూలీలు తమ సొంతూళ్ళకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారికి వాహనాలు దొరకడంలేదు. రోడ్డుని పట్టుకుని, రైలు పట్టాల్ని పట్టుకుని.. అడుగులో అడుగేసుకుంటూ వెళుతున్నారు.

మొన్న, మృత్యువు రైలు రూపంలో దూసుకొచ్చింది.. 20 మందికి పైగా వలస కూలీల్ని పొట్టన పెట్టేసుకుంది. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం 20 మందికి పైగా వలస కూలీల్ని బలి తీసుకుంది. ఇవి లెక్కల్లోకి వచ్చిన ‘పెద్ద ఘటనలు’. లెక్కల్లోకి రాని ఘటనలెన్ని.? అసలు ఇటీవలి కాలంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.? లెక్కలు తీస్తే, అత్యంత భయనాకం.. అంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. ‘కరోనా వైరస్‌ కంటే కిరాతకమైనదీ నిర్లక్ష్యం అనే వైరస్‌.. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’ అనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌ అయ్యింది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మెయిన్‌టెనెన్స్‌ లోపం తలెత్తి ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తేల్చారు. 12 మంది ప్రాణాలు కోల్పోవడానికి లాక్‌డౌన్‌ కారణమయ్యిందంటే.. పరోక్షంగా ఈ మరణాలు కూడా కరోనా ఖాతాలోనే వేసెయ్యాలి.

కరోనా వైరస్‌తో ప్రత్యక్షంగా మరణించేవారికి అదనంగా, ఈ పరోక్ష చావుల్నమాట. అంటే, ప్రత్యక్ష చావుల కంటే, పరోక్ష చావులే అత్యంత దారుణంగా వుంటున్నాయన్నమాట. ‘వలస కూలీల్ని సొంతూళ్ళకు పంపించేందుకు వాహణాలు సమకూరుస్తున్నాం.. బస్సులు, రైలుళ్ళు తిప్పుతున్నాం..’ అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, ఆ ఏర్పాట్లు సరిపోవడంలేదు. ఎలా సరిపోతుంది.? కోట్లాదిమంది బాధితులుంటే.. వేలాది మందికి మాత్రం ఆ సౌకర్యాలు అందుబాటులో వుంటున్నాయి. ఎక్కడికక్కడ ఆగిపోయినవారికి కనీసం భోజనం పెట్టలేని దుస్థితిని ఏమనుకోవాలి.? లక్షల కోట్ల ప్యాకేజీలు.. ఎవడి కోసం.? పేదవాడికి ముద్ద పెట్టలేని ప్యాకేజీలతో దేశానికి జరిగే మేలు ఏంటి.? ఛస్తామని తెలిసీ.. అత్యంత భయానకమైన పరిస్థితుల్లో వలస జీవులు నడుచుకుంటూ వెళుతున్నారంటే దేశం సిగ్గుపడాల్సిన సందర్భమిది.

ఓ పచ్చి బాలింత.. 100 కిలోమీటర్ల దూరం నడిచింది.! గర్భిణిగా బయల్దేరి, మార్గమద్యంలో బడ్డను ప్రసవించి, ఆ బిడ్డను పట్టుకుని మళ్ళీ నడవాల్సి వచ్చింది ఆ అభాగ్యురాలికి. ప్రభుత్వాలు చెప్పే మాటలకి.. వాస్తవ పరిస్థితులకీ పొంతన లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు.. ఏపీలో ఏవీ ఎక్కడ.?

జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారం, అదే రోజు రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకటి పాత పేరుతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌...

ఎక్కువ చదివినవి

జస్ట్‌ ఆస్కింగ్‌: ఆ 49 మందిలో ‘ఇల్లిటరేట్స్‌’ వున్నారా అద్దేపల్లి శ్రీధర్‌గారూ.!

ఒకప్పుడు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకుని, ఆ తర్వాత జనసేన తరఫున వకాల్తా పుచ్చుకుని, ప్రస్తుతం వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటోన్న అద్దేపల్లి శ్రీధర్‌.. ఓ ఛానల్‌ చర్చా కార్యక్రమంలో ‘ఇల్లిటరేట్స్‌’ అంటూ...

కరోనా ఎఫెక్ట్‌ : ఇండియాను బ్యాన్‌ చేసిన జపాన్‌

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల దేశాల్లో కరోనా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు విదేశాలతో పూర్తి సంబంధాలను కట్‌ చేసుకున్నాయి. జపాన్‌ దేశంకు ప్రతి ఏడాది లక్షలాది మంది టూరిస్టులు...

ఇస్మార్ట్ భామకు బాగా బోర్ కొడుతోందిట

ఇస్మార్ట్ శంకర్ తో నభ నటేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో నటన పరంగానే కాకుండా వడ్డించిన గ్లామర్ విందుకు యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఇస్మార్ట్ శంకర్ నభ కెరీర్...

నాగబాబుపై పోలీసు కేసు నమోదు

ఈమద్య కాలంలో నాగబాబు మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాడు. ఆయన సోషల్‌ మీడియాలో చేస్తున్న కామెంట్స్‌ కారణంగా ఆయన రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం గాడ్సే గొప్ప దేశ భక్తుడు అంటూ...

ఫ్లాష్ న్యూస్: ఈ విపత్తు సమయంలో చైనా ఎంతటి నీచానికి పాల్పడినదో తెలుసా?

ప్రపంచం మొత్తం కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా ఇండియాపై దాడి చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో చైనా కూడా తమ నీచమైన బుద్దిని...