Switch to English

గోరంట్ల మాధవుడి లీలలు.! ఇంతకన్నా ఏం ఆశించగలం.?

ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ రాజకీయ విశ్లేషకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా.. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపైనా.!

‘అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, బెయిల్ మీదున్న వ్యక్తిని అధికార పీఠమెక్కిస్తే, ఆయన హయాంలో, ఆయన పార్టీకి చెందిన నేతలు న్యూడ్ వీడియో కాల్ వివాదంలో ఇరుక్కోవడం వింత ఎలా అవుతుంది.?’ అన్నది సదరు రాజకీయ విశ్లేషకుడి ప్రశ్న.

‘అది ఒరిజినల్ కాదురా డాష్.. నీకు చూడాలనిపిస్తే చెప్పు.. నీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తా..’ అంటూ సాక్షాత్తూ ఓ బాధ్యతగల ప్రజా ప్రతినిథి, అందునా.. దేశ భవిష్యత్తు కోసం చట్టాలు చేసే పార్లమెంటులో సభ్యుడిగా వున్న ఓ వ్యక్తి అత్యంత జుగుప్సాకరమైన భాష ప్రయోగించాడంటే, ముమ్మాటికీ.. అది అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన ధైర్యం వల్లనే.. అని ఆ రాజకీయ విశ్లేషకుడు చెప్పుకొచ్చాడు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని తీసుకుంటే. ఆయన్ని ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఆయన్నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి, గోరంట్ల మాధవ్ విషయంలో ఆ ప్రక్రియ ఎందుకు జరగలేదు.? ఎందుకంటే, రఘురామ వైసీపీకి ఎదురు తిరిగారు.. గోరంట్ల మాధవ్ వైసీపీ అధిష్టానానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా వున్నారు.. అదీ తేడా.

నేరం జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు నిజాలు నిగ్గు తేల్చడం పోలీసులు అలాగే దర్యాప్తు సంస్థల విధి. విచారణ తదుపరి న్యాయస్థానాలకు నివేదిస్తే, అక్కడ తేలుతుంది ఎవరు తప్పు చేశారో.!

గోరంట్ల మాధవ్ మీద కుట్ర జరిగి వుండొచ్చని సాక్షాత్తూ హోంమంత్రి తానేటి వనిత ప్రకటించేశాక, వీడియో కాల్ ఫేక్ అని కాక.. ఎస్పీ ఫకీరప్ప ఆ వీడియోలో వున్నది గోరంట్ల మాధవ్ అని ధృవీకరిస్తారనే ఆలోచన ఎవరికైనా వస్తుందా.? ఛాన్సే లేదు. ఇక్కడే ఈ కేసు దాదాపుగా చచ్చిపోయింది.

సినీ నటుడు పృధ్వీరాజ్ మీద చర్యలు తీసుకున్నట్లుగా అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల మీద చర్యలు తీసుకోనప్పుడే, రాష్ట్రంలో వ్యవస్థలెలా పనిచేస్తున్నాయో అర్థమయిపోయింది. సో, గోరంట్ల మాధవ్ అంత అగ్రెసివ్‌గా మాట్లాడటంలో ఎవరికీ వింతగా అనిపించడంలేదు. కాకపోతే, ఆయన మాటల్ని మీడియా సాక్షిగా వింటూ, జనం సిగ్గు పడుతున్నారు. తప్పదు, ఎవర్ని చట్ట సభలకు పంపిస్తున్నామనే సోయ లేకుండా ఓట్లేస్తున్నప్పుడు, ఆ జనానికి ఆ మాత్రం శిక్ష పడి తీరాల్సిందే కదా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

మనల్ని ఎవడ్రా ఆపేది..! ఫ్యాన్ మేడ్ పోస్టర్ తో మెగా ఫ్యాన్స్ రచ్చ.. రచ్చ

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బ్లూ కలర్ షర్ట్, తెల్ల పంచె, గాగుల్స్ తో చిరంజీవి నడిచి వస్తున్న స్టిల్ రిలీజ్ చేశారు...

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్.

గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో -...

మహేష్ బాబుకి తల్లి అంటే అమితమైన ఇష్టంకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర దేవి మరణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. మహేష్ బాబు తన తల్లి మరణం జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న...

రామ్ చరణ్..! మెగా వారసత్వాన్ని ఘనంగా చాటిన నిశ్శబ్ధ విస్ఫోటనం

ఒక తరంలో ఓ వ్యక్తి సాధించిన కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, అంతస్థులను కాపాడటమే కాదు, తర్వాతి తరానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారసుడిదే. ముఖ్యంగా సినీ, రాజకీయం, పారిశ్రమిక రంగాల్లో తండ్రి...

రాశి ఫలాలు: బుధవారం 28 సెప్టెంబర్ 2022

పంచాంగం  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ తదియ రా.1:50 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ చవితి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: చిత్త ఉ.7:33...