ఏదైనా ఒక సినిమా భారీ విజయం సాధిస్తే అదే సెంటిమెంట్ ను మళ్ళీ రిపీట్ చేయాలని చూస్తుంటారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని అదే చేస్తున్నాడు అనిపిస్తోంది. గతేడాది ఆరంభంలో క్రాక్ తో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని బాలకృష్ణతో చేయనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఇక బాలయ్య చిత్రానికి క్రాక్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రాక్ కు సంగీతం అందించిన ఎస్ ఎస్ థమన్ ను ఈ చిత్రం కోసం కూడా రిపీట్ చేసాడు. క్రాక్ హీరోయిన్ శృతి హాసన్ ను కూడా ఈ చిత్రానికి హీరోయిన్ ను చేసాడు.
ఇక క్రాక్ లో వరలక్ష్మి కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు బాలయ్య 107వ చిత్రంలో కూడా వరలక్ష్మి నటించనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసారు. అలాగే విలన్ గా పరభాషా నటుడ్ని ఎంపిక చేసాడు క్రాక్ తరహాలోనే.