విశ్వం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటారని.. ఇది అసలైన పండగ మూవీ అని హీరో గోపీచంద్ చెప్పుకొచ్చారు. గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల కాంబోలో వస్తున్న మూవీ విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కో ప్రొడ్యూసర్ వివేక్ కూచుబొట్ల కలిసి నిర్మిస్తున్నారు. ఈ నెల 11న మూవీ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో మూవీకి సంబంధించిన అనేకి ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.
సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటుంది. ఈ సినిమాలో చాలా చోట్ల నవ్వు ఆపుకోలేరు. షూట్ చేసే సమయంలో నేను ఆపుకోలేక నవ్వేశాను. అంత హిలేరియస్ గా ఉంటాయి సీన్లు. ఇక యాక్షన్ సీన్లకు కూడా కొదువ లేదు. కానీ మెయిన్ గా మాత్రం కామెడీనే హైలెట్ గా ఉంటుంది అన్నారు గోపీచంద్. శ్రీనువైట్ల నాకు కథ చెప్పినప్పుడే ఇది పర్ ఫెక్ట్ గా నాకు సెట్ అవుతుందని అనిపించింది. లౌక్యం తర్వాత అలాంటి ఫుల్ ఎటర్ టైన్ మెంట్ స్టోరీ ఇది. ఓ వైపు యాక్షన్ ను ఇంకోవైపు కామెడీని ఇందులో బ్యాలెన్స్ చేశారు శ్రీనువైట్ల.
ఇందులో హీరోతో పాటు పాప రోల్ కూడా చాలా కీలకం. ఇక ట్రైన్ ఎపిసోడ్ ఇందులో చాలా హైలెట్ గా ఉంటుంది. శ్రీనువైట్ల ఎలా కామెడీ చేయాలో కూడా చెబుతారు. అందుకే ఆయన సినిమాలకు పని చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్లు కూడా ఇందులో చాలా ఉన్నారని.. సినిమా చూసినంత సేపు బోర్ కొట్టదు అంటూ తెలిపారు గోపీచంద్. ఇక ప్రభాస్ తో కూడా మూవీ చేయాలని ఉందన్నారు. కాకపోతే అన్నీ కుదరాలని.. దానికి ఇంకా టైమ్ ఉందంటూ చెప్పుకొచ్చారు ఈ హీరో.