మన దేశంలో సిమ్ నెట్ వర్క్ తోనే కాల్స్, ఇంటర్ నెట్ సదుపాయాలు వాడుతారు. ఏ సిమ్ వారి ఫోన్ లో వేసుకుంటే అదే సిమ్ తో అన్ని నెట్ వర్క్ లను పొందవచ్చు. ఒకవేళ ఆ నెట్ వర్క్ పోతే అంతే సంగతులు. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర టెక్ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా రీసెంట్ గా ఇంటర్ సర్కిల్ రోమింగ్ ను ప్రారంభించారు. ఇండియాలో ఉన్న జియో, ఎయిర్ టెల్, బీఎస్ ఎన్ ఎల్ యూజర్లు నిరంతరాయంగా 4జీ సేవలను వినియోగించుకునేందుకు వెసలుబాటు కల్పించే విధంగా మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూడు సిమ్ ల యూజర్లు ఇతర నెట్ వర్క్ లను కూడా ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ తమ సిమ్ సొంత నెట్ వర్క్ ను కోల్పోతే అప్పుడు వారికి ఏ నెట్ వర్క్ అందుబాటులో ఉంటే దాంతో కనెక్ట్ కావచ్చు. అలా కనెక్ట్ అయి కాల్స్, ఇంటర్ నెట్ సదుపాయాలను కూడా పొందవచ్చు. అంటే ఏ నెట్ వర్క్ కు చెందిన యూజర్లు అయినా ఒకే డీబీఎన్ ఫండెడ్ టవర్ ద్వారా 4జీ సేవలను పొందవచ్చన్నమాట. ఇలా చేయడం వల్ల ఎక్కువ యూజర్లకు మేలు కలుగుతుంది. దీంతో పాటు మరికొన్ని మార్పులు చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది ట్రాయ్ సంస్థ. సిమ్ రీఛార్జ్ చేయకుండా డియాక్టివేషన్ అయితే దాన్ని ఆక్టివేషన్ టైమ్ ను కూడా పెంచుకోవడానికి రూ.20తో పొడిగించబోతోంది.