Switch to English

కరోనా రహిత తొలి రాష్ట్రంగా గోవా.. ఎలా సాధ్యమైంది?

ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రముఖ పర్యాటక రాష్ట్రమైన గోవా కరోనా రహితంగా మారింది. దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేని తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈనెల 3న అక్కడ చివరి పాజిటివ్ కేసు నమోదు కాగా, ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారణ అయినవారంతా కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. ఆ రాష్ట్రం ముందుచూపే ఇందుకు కారణమని చెప్పొచ్చు.

చిన్న రాష్ట్రమైన గోవా జనాభా 16 లక్షల కంటే తక్కువే. దేశంలో కరోనా కల్లోలం మొదలు కాగానే మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగానే గోవా మేల్కొంది. పర్యాటక ప్రాంతం కావడంతో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇక్కడకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు కాబట్టి, త్వరగా కరోనా సోకే ప్రమాదం ఉందని గ్రహించి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు అందరి కంటే ముందుగానే మొదలుపెట్టింది.

ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించడానికి ముందుగానే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కొన్ని చర్యలు చేపట్టారు. రోడ్డు పక్క దుకాణాలు మూయించివేయడం దగ్గర నుంచి ప్రజా రవాణాను పరిమితం చేయడం వంటి పలు లాక్ డౌన్ చర్యలు ముందుగానే తీసుకున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం మార్చి 25న గోవాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేశారు. ఏప్రిల్ 3న చివరి కేసు వెలుగు చూసింది.

మొత్తమ్మీద కరోనా లక్షణాలు కలిగిన, వారితో కాంటాక్టు ఉన్న 800 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఏప్రిల్ 15 నాటికి ఆరుగురు కోలుకుని ఇంటికి వెళ్లిపోగా.. ఆదివారం ఏడో వ్యక్తి కూడా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. దీంతో కరోనా కేసులు లేని తొలి రాష్ట్రంగా గోవా రికార్డు సృష్టించింది. దీంతో కేంద్రం నిర్ణయం మేరకు సోమవారం నుంచి లాక్ డౌన్ మినహాయింపులు వర్తింపజేస్తోంది.

అయితే, ప్రజలు భౌతిక దూరం పాటించే విషయలో కఠినంగానే వ్యవహరిస్తోంది. బైక్ పై ఒకరు మాత్రమే వెళ్లాలని, కారులో డ్రైవర్ కాకుండా మరో వ్యక్తికి మాత్రమే ప్రయాణించాలని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. పైగా కారులో రెండో వ్యక్తి డ్రైవర్ పక్క సీటులో కాకుండా తప్పనిసరిగా వెనుక సీటులోనే కూర్చోవాలని నిర్దేశిస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తున్నారు.

కరోనా రహిత తొలి రాష్ట్రంగా ఉన్న గోవాలో మళ్లీ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చూడాలనే లక్ష్యంతో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ముందుకెళ్తున్నారు. మరోవైపు తాజాగా మణిపూర్ సైతం కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది. ఇక్కడ రెండు పాజిటివ్ కేసులు రాగా, ఇరువురూ కోలుకున్నారు.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

ఆ వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు ఖాయమా?

కరోనా విజృంభిస్తున్న తరుణంలోనూ ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఒకరిపై విమర్శలు, ఆరోపణలు షరా మామూలుగానే...

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...

క్రైమ్ న్యూస్: 9 ఏళ్ళ బాలికపై 14 ఏళ్ళ బాలుడి అఘాయిత్యం.. ప్రతిఘటించడంతో ఏం చేశాడంటే

సినిమాల ప్రభావమో లేదా సోషల్‌ మీడియా ప్రభావమో కాని 15 యేళ్లు కూడా నిండకుండానే అబ్బాయిలు అత్యంత కఠినంగా నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల బాలుడు తాను చదువుకునే...

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.? మీరు అనుకున్నది కరెక్టే కానీ తెలుగు...