Switch to English

గ్రేటర్‌ ఫైట్‌: ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఎవరి ఓట్లు ఎవరికి పడటమేంటి.? ఫలానా పార్టీ ఓట్లు ఫలానా పార్టీకే పడాలా.? ఓటర్లను ఆయా రాజకీయ పార్టీలు గంపగుత్తగా తీసేసుకున్నాయా.? ఇలాంటి ప్రశ్నలు ప్రజాస్వామ్యవాదుల నుంచి రావడం సహజమే. అయితే, సంద్రపాయ ఓటు బ్యాంకు.. అనేది ఆయా పార్టీలకు వుంటుంది. కానీ, సందర్భాల్ని బట్టి ఆ సంప్రదాయ ఓటు బ్యాంకుకి చిల్లు పడుతుంది. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, టీడీపీల ఓటు బ్యాంకుకి చిల్లు పడింది. ఇక్కడ, టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకుకీ దెబ్బ తగిలింది.

ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో లాభపడింది మాత్రం బీజేపీనే. అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది గ్రేటర్‌ హైద్రాబాద్‌లో. నిజానికి, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కలు చూస్తే, గ్రేటర్‌ మేయర్‌గిరీని బీజేపీ కైవసం చేసుకుంటుందా.? అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ, ఫస్ట్‌ రౌండ్‌, రెండో రౌండ్‌.. ఇలా రౌండ్లు పెరిగేకొద్దీ పిక్చర్‌ క్లారిటీ వచ్చేసింది. టీఆర్‌ఎస్‌, హైద్రాబాద్‌ మేయర్‌ పదవిని నిలబెట్టుకోబోతోంది. కానీ, టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో దారుణంగానే దెబ్బతినేసింది. మజ్లిస్‌ పార్టీ తన స్థానాల్ని నిలబెట్టుకునేలా వుంది. ఆ పార్టీకి కలిగిన నష్టమేమీ లేదు. కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కోల్పోయింది. ‘ఖచ్చితంగా మేయర్‌గిరీ సొంతం చేసుకుంటాం.. ఒకవేళ ఆ స్థాయిలో సీట్లు రాకపోయినా, మేం లాభపడినట్లే.. గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటుతాం.. చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకుంటాం.. తెలంగాణ రాజకీయాలకు కొత్త దశ, దిశ చూపిస్తాం..’ అంటూ బీజేపీ చెప్పింది.. చెప్పినట్లుగానే గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటింది.

ఇక, చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గ్రేటర్‌ మేయర్‌గిరీని నిలబెట్టుకోనున్న టీఆర్‌ఎస్‌, నిస్సిగ్గుగా సంబరాలు చేసుకుంటోంది. ఎందుకు.? వున్న సీట్లు కోల్పోయినందుకా.? అంటూ టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనే ఒకింత ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తమవుతోంటే, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం, అక్కడికేదో క్లీన్‌ స్వీప్‌ చేసినట్లుగా పండగ చేసుకుంటున్నారు. కాగా, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఇటు బీజేపీకి, అటు టీఆర్‌ఎస్‌కి సమానంగా వెళ్ళిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు మాత్రం పూర్తిగా బీజేపీ వైపుకు వెళ్ళిందట. వైసీపీ ఓటు బ్యాంకు, టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడిందని సమాచారం. అదే సమయంలో, టీఆర్‌ఎస్‌కి గతంలో మద్దతిచ్చిన చాలామంది, ఈసారి బీజేపీ వైపు తిరిగినట్లు అంచనా వేస్తున్నారు.

3 COMMENTS

  1. 970100 954955The vacation delivers on offer are : believed a selection of some of the most selected and in addition budget-friendly global. Any of these lodgings tend to be quite used along units may possibly accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 761343

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...